ఉద్యమానికి కాంగ్రెస్ నో! నలుగురు తెలంగాణ నాయకులు కె. జానారెడ్డి, ఆర్. దామోదరరెడ్డి, కె.ఆర్. అమోస్, బస్వరాజు సారయ్య హాజరైన ప్రత్యేక సమావేశంలో సోనియా ఈ విషయం స్పష్టం చేసినట్లు ఆ కాంగ్రెస్ నాయకుడు తెలియజేశారు. మీడియా కంట పడకుండా తప్పించడానికై సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ ఒక ప్రత్యేక కారులో ఆ నలుగురినీ ఆమె నివాసానికి తీసుకువెళ్లారని, ఈ అంశం కేంద్రం పరిశీలనలో ఉన్నందున తమ రాజీనామాలను ఉపసంహరించుకోవలసిందిగా శాసనసభ్యులందరికీ సూచించాలని వారిని సోనియా ప్రత్యేకంగా కోరారని ఆయన తెలిపారు.తెలంగాణ సమస్యకు అందరినీ సంప్రదించి పరిష్కారం సాధించడానికి సానుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు తిరిగి మామూలు పరిస్థితులను నెలకొల్పడం, రాజీనామాలను ఉపసంహరించుకోవడం తప్పనిసరని సోనియా స్పష్టం చేసినట్లు ఆ బృందం సభ్యుడు ఒకరు వెల్లడించారు.
జానారెడ్డి, దామోదరరెడ్డి, సారయ్య శనివారం సమావేశంలో ఎంఎల్ఎలకు ఈ విషయం తెలియజేస్తారు. జానారెడ్డి శుక్రవారం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను కలుసుకుని ఈ పరిణామాల గురించి వివరించారు. 'ఈ సమావేశంలో తదుపరి కార్యాచరణపై మేము చర్చ జరుపుతాం' అని జానారెడ్డి మీడియాతో చెప్పారు.'కమిటీ ఏర్పాటుపై ఒక వారంలోగా ప్రకటన రావచ్చు కనుక రాజీనామాలు, డెడ్ లైన్ల అవసరం ఇక లేదు. అందువల్ల కమిటీ నిర్దుష్ట వ్యవధిలో తన నివేదికను సమర్పించేట్లు చూడడం కాంగ్రెస్ నాయకుల బాధ్యత' అని సీనియర్ నాయకుడు, ఎంఎల్ సి కె.ఆర్. అమోస్ 'టైమ్స్ ఆఫ్ ఇండియా' (టిఒఐ) విలేఖరితో అన్నారు.ఇది ఇలా ఉండగా, రాజీనామాల ఆమోదానికై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కారును తెలంగాణ ఆందోళనకారులు నల్లగొండ పట్టణంలో నిలిపివేశారు.
Pages: -1- 2 News Posted: 30 January, 2010
|