ఐపిఎల్ రేసులో దిగ్గజాలు 'నేను నా సొంతంగా కొనాలనే ఆసక్తి నాకు లేకపోవచ్చు. కాని ఒక కన్సార్టియంలో భాగంగా బిడ్ చేయడానికి సుముఖంగా ఉంటాను' అని పూనావాలా గ్రూపు సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అదార్ పూనావాలా చెప్పారు. సహారా గ్రూప్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, 'మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు' అని చెప్పారు. తమ గ్రూపునకు ఈ విషయమై ఆసక్తి ఉందని ఆయన పరోక్షంగా ధ్రువీకరించారు. హీరో హోండా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజల్ ప్రస్తుతం పెదవి కదపడం లేదు. కానీ, 'వ్యక్తిగత హోదా'లో ఒక ఐపిఎల్ జట్టును సొంతం చేసుకోవడం పట్ల ముంజల్ ఆసక్తి కనబరుస్తున్నారని, కాని బాగా ఎక్కువగా ఉన్న రిజర్వ్ ధర అవరోధంగా ఉన్నదని సంస్థ వర్గాలు తెలియజేశాయి.
రెండు కొత్త జట్లకు కనీస బేస్ ధరను 225 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1000 కోట్లు)గా నిర్ణయించారు. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ముంబై ఇండియన్స్ జట్టును సొంతం చేసుకోవడానికి చెల్లించిన అత్యధిక ధర 112 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 500 కోట్ల)కు ఇది రెట్టింపు కన్నా ఎక్కువ. నాలుగవ సీజన్ కు నిర్ణయించిన బేస్ ధర 2007లో కన్నా సుమారు ఐదింతలు ఉంది. 2007లో కనీస బేస్ ధరను 50 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 230 కోట్లు)గా నిర్థారించారు. అడాగ్ కు చెందిన రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ అధ్యక్షుడు రాజేష్ సహానీ ఈ విషయమై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ఇది ఇలా ఉండగా, బిడ్ షరతులు పరిశీలించడం కోసం తాము వేచి ఉండగలమని వర్ధమాన బిడ్డర్లు చెప్పారు. 'బిడ్ లకు ఇంకా ఒక నెల వ్యవధి ఉన్నది. షరతులు పరిశీలించిన తరువాతే నేను నిర్ణయం తీసుకుంటాను' అని వారిలో ఒకరు చెప్పారు.
Pages: -1- 2 News Posted: 4 February, 2010
|