ర్యాంకింగ్ గేమ్
సపారీలు ఏ స్కోరుతో ఓటమి పాలైనా అది కచ్చితంగా ఆస్ట్రేలియన్లకు మేలు చేకూరుస్తుంది. ప్రస్తుతం ఆ జట్టుకు కేవలం 116 పాయింట్లే ఉన్నాయి. ఆస్ట్రేలియా జట్టు టెస్ట్ సిరీస్ ఒక్క మ్యాచ్ గెలుచుకున్నా 117 పాయింట్లు పొందుతుంది. రెండు మ్యాచ్ లు గెలుచుకుంటే 119 పాయింట్ లతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో ద్వితీయ స్థానానికి ఎగబాకనుంది.
టీమ్ ఇండియా, సౌత్ ఆప్రికా జట్ల మధ్య జరుగుతున్న ఈ సిరీస్ క్రికెటర్ల వ్యక్తిగత ర్యాంకులను కూడా నిర్దేశించనుంది. గత ఏడాది జోహన్స్ బర్గ్ లో రాణించిన నాటి నుండి భారత ఆటగాడు గంభీర్ టెస్ట్ బ్యాట్స్ మెన్లలో అగ్రస్థానంలో నిలుస్తున్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన స్మిత్ - గంభీర్ మధ్య ఐసీసీ టాప్ బ్యాట్స్ మన్ అవార్డు పోటీ నడుస్తోంది. ఈ సిరీస్ లో చేసిన పరుగుల ఆధారంగా వారిద్దరిలో ఒకరు ఐసీసీ టాప్ బ్యాట్స్ మన్ అవార్డుు గెలుచుకుంటారు. మరోవైపు సచిన్ టెండుల్కర్ కూడా బాగా రాణించి 33 పాయింట్ లు తెచ్చుకోగలిగితే తొమ్మిదో స్థానం నుండి ఐదో స్థానానికి చేరుకుంటాడు.
Pages: -1- 2 News Posted: 4 February, 2010
|