'అమర' ప్రేమ! 50వ పడిలో ఉన్న, తన ఉపన్యాస ప్రావీణ్యం కన్నా 1980 దశకంలో శ్రీదేవితో స్పర్థకు ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చిన జయప్రద ముంబై చిత్రసీమ, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయం నుంచి ఉత్తర ప్రదేశ్ రాజకీయాలలోకి ప్రవేశించారు. ఇందుకు అమర్ సింగ్ తో సంబంధాలే కారణం. వాణిజ్యవేత్త శ్రీకాంత్ నహతాను వివాహం చేసుకున్నా, విడిగా నివసిస్తున్న జయప్రద తన రాజకీయ గురువుకు రుణపడి ఉన్నట్లుగా మాట్లాడుతుంటారు.
'నావి వివస్త్ర ఫోటోలు చలామణీలోకి వచ్చి పెను సంక్షోభంలో నేను చిక్కుకున్నప్పుడు ఆయన నాకు అండగా నిలిచారు. పార్టీ దీనిపై స్పందించలేదు. వీటికి బాధ్యుడైన ఆమ్ ఖాన్ సాబ్ కు కనీసం ఉద్వాసన పలకలేదు కూడా. నాకు బాగా గుర్తు. ఆ రోజు 2009 మే 11. అమర్ జీ హేమోగ్లోబిన్ స్థాయి 6గాను, పొటాషియం స్థాయిలు 10గాను ఉన్నాయి.ఆయన రక్తం కక్కుకుంటున్నారు. డయాలసిస్ చేయించుకుంటున్నారు. అయినప్పటికీ ఆయన నాకు బాసటగా నిలిచారు. అమర్ జీ ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ నేను ఆయన వెంటే ఉంటాను' అని జయప్రద చెప్పారు.
'తమ మనస్సులో నుంచి మాట్లాడే చాలా మంది రాజకీయ నాయకుల వలె కాకుండా అమర్ సింగ్ జీ తన మనస్సు, హృదయం రెండింటితో ఆలోచించి మాట్లాడుతుంటారు. ఆయన తన మిత్రులకు బేషరతుగా మద్దతు పలుకుతుంటారు.అమితాబ్ బచ్చన్ విషయంలో ఆయన అదే చేశారు కదా. ఆయన తెలివైనవారు. విజ్ఞుడు. మేధావుల అభిమానం కూడా పొందారు. చలనచిత్ర పరిశ్రమలో అందరి ప్రేమాభిమానాలు, గౌరవాలు పొందడమే ఆయనకు గొప్ప బలం. ఆయన సినీ సభలకు హాజరైనప్పుడు పరిశ్రమ సంతోషిస్తుంటుంది' అని ఆమె వివరించారు
సమాజ్ వాది పార్టీ నాయకురాలు, అమర్ సింగ్ కు విధేయురాలు అయిన జయా బచ్చన్ ను పార్టీ ఎందుకు కొనసాగిస్తున్నదన్న ప్రశ్నకు జయప్రద సమాధానం ఇస్తూ, 'ఆమె పదవీ కాలపరిమితి మరికొన్ని నెలల్లో ముగియనున్నది. కాని అమర్ జీ ఏది చేయాలని కోరుకుంటారో ఆమె చేస్తారు' అని చెప్పారు.
Pages: -1- 2 -3- -4- News Posted: 5 February, 2010
|