'అమర' ప్రేమ! మరి స్వరాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ విభజన గురించి ప్రశ్నిస్తే ఆమె నేరుగా సమాధానం ఇవ్వలేదు. 'తెలంగాణ విషయంలో నేను ఒక సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నాను. నా మూలాలు సమైక్యాంధ్రలోనే ఉన్నాయి. అయితే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చాలాకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటిది. తెలంగాణ ఏర్పాటును కోరుకుంటున్నవారి మనోభావాలను దెబ్బ తీయడం నాకు ఇష్టం లేదు. అయితే, హైదరాబాద్ గురించే సమస్య అంతా' అని ఆమె పేర్కొన్నారు.
'సమైక్యాంధ్ర వాదులకు హైదరాబాద్ కావాలి. తెలంగాణ వాదులకూ హైదరాబాద్ కావాలి. ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడమే ఏకైక పరిష్కార మార్గమని నా భావన. అప్పుడు రెండు ప్రాంతాలకూ అది దక్కుతుంది. ఏమైనా ఈ అంశం పరిశీలనకు ఒక కమిటీని వేశారు కదా. వారు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా. అనేక మంది యువకులు తమ ప్రాణాలు కోల్పోవడం శోచనీయం. చంద్రశేఖరరావు తెలంగాణ కోసం ధర్నా చేస్తున్నప్పుడే ఈ నిర్ణయం తీసుకుని ఉండవలసింది' అని ఆమె అన్నారు.
జయప్రద ఇలా మాట్లాడుతూనే ఉండగా, ఆమె ఎక్కవలసిన విమానం బయలుదేరబోతున్నట్లు హెచ్చరిక వచ్చింది. తాను ముంబై, ఢిల్లీ, రాంపూర్ మధ్య తన కాలాన్ని గడుపుతున్నట్లు ఆమె చెప్పారు. ఆమె ఇప్పుడు లోక్ మంచ్ కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉంటారు. లోక్ మంచ్ సభ్యులకు బ్లాగింగ్ కు అనుమతి లభిస్తుంది.
Pages: -1- -2- -3- 4 News Posted: 5 February, 2010
|