'అమర' ప్రేమ! అట్టడుగు స్థాయిలో నిరుపేదల కోసం పాటు పడే రాజకీయేతర సంస్థ లోక్ మంచ్ పార్టీని ఏర్పాటు చేయాలని వారి ఆలోచన. 'ఏ అంశంపైనైనా మాట్లాడేందుకు, ఏ సమస్యనైనా పరిష్కరించేందుకు మాకు వీలు కల్పించే వేదిక ఇది. కింది స్థాయి రాజకీయ నాయకునిగా కన్నా మేధావిగానే అమర్ సింగ్ గురించి జనం మాట్లాడుకుంటుంటారు. కాని ఆ అభిప్రాయం తప్పని మేము నిరూపిస్తాం. మేము సమస్యలు తెలుసుకుని, వాస్తవిక దృక్పథంతో పరిశీలించి, పార్లమెంట్ లో ప్రస్తావిస్తాం' అని జయప్రద వివరించారు.
'మేము పార్టీ సభ్యులుగా ఉన్నప్పుడు మేము ఏమి మాట్లాడాలన్నా అవకాశాలు పరిమితం. కాని ఇప్పుడు మేము ఏ పార్టీలోనూ సభ్యులం కానందున సమస్యల పరిష్కారంలో స్వేచ్ఛగా వ్యవహరించగలం. ముందుగా సంక్షోభంలో ఉన్న రైతులను, అత్యంత వెనుకబడిన 16 కులాల వారికి అండగా నిలుస్తాం. మహిళల రిజర్వేషన్ బిల్లుకు ఆమోదముద్ర లభించే విధంగా కృషి చేస్తాం' అని జయప్రద చెప్పారు.
ఇది ఇలా ఉండగా, ఢిల్లీలో మాయావతి గురించి రాజీ ధోరణిలో అమర్ సింగ్ ఇప్పటికే మాట్లాడారు. ఆమెకు అత్యంత ప్రియమైన కార్యక్రమం ఉత్తర ప్రదేశ్ ను విభజించి పూర్వాంచల్ రాష్ట్రం ఏర్పాటు కోసం తాను ఆమెతో కలసి కృషి చేస్తానని జయప్రద చెప్పారు. '(సమాజ్ వాది పార్టీలో ఉన్నప్పుడు) పార్టీ విధానాన్నిసమర్థిస్తుండేదానిని. రాష్ట్ర విభజన శ్రేయస్కరం కాదంటూండేదానిని. కాని ఇప్పుడు మేము వారితో లేనందున పూర్వాంచల్ డిమాండ్ కు నేను మద్దతు ఇస్తానని, దాని కోసం కృషి చేస్తానని చెప్పగలను' అని జయప్రద పేర్కొన్నారు.
Pages: -1- -2- 3 -4- News Posted: 5 February, 2010
|