భారతీయుల 'కంగారూ' మహారాష్ట్రలో ఆస్ట్రేలియన్ క్రికెటర్లు ఆడకుండా నిషేధం విధించాలని శివసేన అధినేత బాలాసాహెబ్ థాకరో క్రితం నెల పార్టీ పత్రిక 'సామ్నా'లో సంపాదకీయంలో పిలుపు ఇచ్చిన విషయం విదితమే. ఆస్ట్రేలియాలో భారతీయులపై పదేపదే దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ పిలుపు ఇచ్చారు. పార్టీ అధినేత సూచనలను పాటిస్తుందని, తనదైన విచ్ఛిన్నకర సరళిలో ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టు పర్యటనను అడ్డుకుంటుందని శివసేన నాయకుడు, 'సామ్నా' సంపాదకుడు సంజయ్ రౌత్ తెలియజేశారు.
ఐపిఎల్ జట్లలో సుమారు 20 మంది ఆస్ట్రేలియన్ క్రీడాకారులు ఉన్నారు. వారిలో డక్కన్ చాలెంజర్స్ కెప్టెన్ ఆడమ్ గిల్ క్రిస్ట్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ షేన్ వార్న్, సైమన్ కాటిచ్, బ్రెట్ లీ, మాథ్యూ హేడెన్, మైకేల్ హుస్సీ, ఆండ్రూ సైమండ్స్, షాన్ మార్ష్ వంటి అగ్ర శ్రేణి క్రీడాకారులు కూడా ఉన్నారు.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు శశాంక్ మనోహర్, శివసేన అధినేత బాల్ థాకరే మధ్య సమావేశంలో ఈ విషయంలో తీసుకున్న నిర్ణయం పట్ల తాము సంతృప్తి చెందలేదని గుప్తా తెలియజేశారు. 'వారు ప్రముఖ క్రీడాకారులు. ఐపిఎల్ ను ఆసక్తిదాయకంగా తీర్చిదిద్దడంలో వారు ముఖ్య పాత్ర పోషించారు. పైగా ఇండియా ఆతిథ్యానికి పెట్టింది పేరు. ఈ పేరును దేశం నిలుపుకుంటుందని మా ఆకాంక్ష' అని గుప్తా చెప్పారు. కాగా, ఆస్ట్రేలియాలోని భారతీయుల దుస్థితిని తీవ్రంగా పరిగణిస్తున్నందుకు భారత రాజకీయ నాయకత్వానికి తమ సమాఖ్య ధన్యవాదాలని గుప్తా చెప్పారు.
Pages: -1- 2 News Posted: 10 February, 2010
|