చాంపియన్స్ లీగ్ ఎక్కడ? క్రితం సంవత్సరం ఐపిఎల్ ను దక్షిణాఫ్రికాకు తరలించినప్పుడు స్వల్ప వ్యవధి మాత్రమే ఉన్నప్పటికీ ఆ బాధ్యత విజయవంతంగా నిర్వహించారు. అందువల్ల సిఎల్ టి20 టోర్నీ నిర్వహణ బాధ్యత తిరిగి దక్షిణాఫ్రికాకే అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం మోడికి, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఇసిబి)కి మధ్య తేదీల గొడవ ఉన్న దృష్ట్యా ఈ టోర్నమెంట్ ను ఇంగ్లండ్ నిర్వహించే అవకాశం తక్కువే. పైగా తమ కౌంటీ పోటీల కార్యక్రమంలో ఎటువంటి మార్పులు చేయడానికైనా ఇంగ్లండ్ విముఖంగా ఉండడం ఇందుకు కారణం. మరొక వైపు పాకిస్థాన్ నాలుగు టెస్టులు, ఐదు ఒడిఐలు (నాట్ వెస్ట్ సీరీస్) ఆడేందుకు జూన్ నెల నుంచి ఇంగ్లండ్ లో పర్యటించవలసి ఉన్నది. ఈ సీరీస్ సెప్టెంబర్ 22న ముగుస్తుంది.
'చాంపియన్స్ లీగ్ కు ఆతిథ్యం ఇవ్వాలని మేము తప్పకుండా కోరుకుంటాం. కాని ఈ సంవత్సరం తేదీలే సమస్య. మా బ్రాడ్ కాస్టర్లు, స్పాన్సర్లకు చేసిన వాగ్దానాల కారణంగా మేము ఏదీ మార్చజాలం' అని ఇసిబి అధికార ప్రతినిధి చెప్పారు. అయితే, అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యచకితులను చేయడంలో ఎన్నడూ విఫలం కాని లలిత్ మోడి ఈ టోర్నీని సాధ్యం చేయడానికి కృషి సాగిస్తున్నారు. చాలా సందర్భాలలో తాను కోరుకున్న విధంగా పనులు జరిగేట్లు ఆయన చూడగలిగారు. బహుశా ఈసారి చాంపియన్స్ లీగ్ ను యుకెకు కానుకగా ఇచ్చి ఆయన సత్ఫలితాన్ని సాధించవచ్చు.
ఇతర అభ్యర్థి దేశాలలో యుఎస్ ఇప్పటికీ అవకాశం లేకపోవచ్చు. ఇందుకు వాణిజ్య, క్రీడా మైదానం హక్కులకు సంబంధించినవి పెక్కు కారణాలు ఉన్నాయి. ఏమైనా మోడి యుఎస్ లో మ్యాచ్ లు నిర్వహించాలనే తన ప్లాన్లను ఖరారు చేసిన పక్షంలో ఐపిఎల్ ముందు ఆ దేశానికే వెళుతుందని 'టిఒఐ'కి అందిన సమాచారం వల్ల తెలుస్తున్నది. (ప్రారంభకుల కోసం ఎగ్జిబిషన్ మ్యాచ్ లు నిర్వహించవచ్చు). ఆస్ట్రేలియాకు కూడా ఇందుకు అవకాశం లేదు. ఇండియాకు, ఆస్ట్రేలియాకు మధ్య గల కాల భేదం ఇందుకు కారణం. ఆస్ట్రేలియాలో దీనిని నిర్వహిస్తే ఇండియాలో ప్రైమ్ టైమ్ వీక్షకులకు సమస్య ఎదురవుతుంది.
Pages: -1- 2 News Posted: 12 February, 2010
|