తగ్గిన థాకరే ఇదే థాకరే సోమవారం నాడు 'ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు కొనసాగుతున్నందున ఆస్ట్రేలియన్ క్రికెటర్లు ఆడడం పట్ల మా అభ్యంతరంపై మేము వెనుకకు తగ్గే ప్రసక్తి లేదు. ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారతీయులపై జాతి వివక్షపూరిత దాడులు కొనసాగినంత కాలం ముంబైలో గాని, మహారాష్ట్రలో ఇతర నగరాల్లో గాని ఐపిఎల్ పోటీలలో వారిని మేము ఆడనివ్వబోము' అని ఆయన పార్టీ కార్యకర్తలు వీడియో టేపు ద్వారా ఇచ్చిన సందేశంలో స్పష్టం చేశారు.
ఐపిఎల్ లో ఆస్ట్రేలియన్లను ఆడనివ్వవలసిందని విజ్ఞప్తి చేసేందుకై కేంద్ర మంత్రి శరద్ పవార్ క్రితం వారం ముంబై బాంద్రాలోని బాల్ థాకరే నివాసానికి వెళ్లిన విషయం విదితమే. అయితే, శివసేన అధినేతకు ఉపశమనం పొందడానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సిపి) అధ్యక్షుడు, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) మాజీ అధ్యక్షుడు కూడా అయిన శరద్ పవార్ అవకాశం కల్పించగా, 'మై నేమ్ ఈజ్ ఖాన్'కు జనంలో కనిపించిన స్పందన మంగళవారం శివసేన వైఖరి మారడానికి కారణమై ఉండవచ్చునని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
థాకరే వైఖరి అకస్మాత్తుగా పూర్తిగా మారిపోవడం గురించిన ప్రశ్నకు ఇదేమీ 'పూర్తిగా' వైఖరిని మార్చుకోవడం కాదని రౌత్ సమాధానం ఇచ్చారు. 'బాలాసాహెబ్ ను శశాంక్ మనోహర్ (బిసిసిఐ అధ్యక్షుడు), శరద్ పవార్ కలుసుకుని ఐపిఎల్ లో పాకిస్తానీ క్రీడాకారులు ఆడడం లేదని చెప్రారు. ఆస్ట్రేలియన్ క్రికెట్ జట్టు కూడా ఆడడం లేదు. కొద్ది మంది ఆస్ట్రేలియన్ క్రికెటర్లు మాత్రమే వివిధ జట్ల తరఫున ఆడుతున్నారు. బిసిసిఐ ఆతరువాత ఇదే విషయం వివరించింది' అని రౌత్ తెలియజేశారు. అయితే, ఈ విషయమై ఇంకా వివరంగా మాట్లాడడానికి రౌత్ నిరాకరించారు.
Pages: -1- 2 News Posted: 17 February, 2010
|