టైటన్ చక్కని సవాల్
ముంబై : టీనేజర్ల కోసం వాచీల నుంచి వజ్రాల నగల వరకు టాటా సంస్థ పలు కొత్త మార్కెట్ విభాగాలను సృష్టించింది. అందరూ సాగే మార్గంలో టైటన్ ఇండస్ట్రీస్ ఎప్పడూ నడవలేదు. సంస్థ ఉత్పత్తులు వాచీల నుంచి అభరణాలు, కళ్లజోళ్ల వరకు వ్యాప్తి చెందడమే దాని విశిష్ట పంథాను సూచిస్తున్నది. ఆ సంస్థ నెలకొల్పిన ప్రమాణాల ప్రకారం చూసినా దాని తాజాగా తలకెత్తుకున్న బాధ్యత ఎంతో సవాల్ తో కూడుకున్నదని అనక తప్పదు. టీనేజర్లకు వజ్రాల ఆభరణాలను విక్రయించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నది. సాంప్రదాయకంగా ఆ వర్గంపై ఆభరణాల అమ్మకాల ప్రభావం ఎప్పుడూ పడడం లేదు.
బెంగళూరు ప్రధాన కేంద్రంగా గల 3800 కోట్ల రూపాయలతో టైటన్ సంస్థ ఈ వజ్రాల నగల వ్యాపార విభాగాన్ని ప్రారంభించింది. 999 రూపాయల నుంచి 1500 రూపాయల శ్రేణిలో తన వజ్రాల కలెక్షన్ తో మొదటిసారి నగలు కొనుగోలు చేసేవారిని ఆకట్టుకునే ప్రయత్నంలో కొత్త మార్కెట్ విభాగాన్ని సృష్టిస్తున్నది. ఇది ఆది నుంచి ఇదే పంథాను అనుసరిస్తున్నది. మెకానికల్ వాచీలతో హెచ్ఎంటి ఆధిపత్యం వహిస్తున్న మార్కెట్ లో కొత్త విభాగం సృష్టికి టాటా ప్రెస్ ఎండి జెర్ గ్జెస్ దేశాయి టిడ్కోతో కలసి ఒక సంయుక్త సంస్థను ఏర్పాటు చేసినప్పుడు ఇందుకు నాంది పడింది. టైటన్ వాచెస్ పేరిట ఈ సంస్థ 1987లో తన కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది.
'ఆ సమయంలో వినియోగదారునికి సమయం సూచించే సాధనాలుగా మాత్రమే వాచీల గురించి తెలుసు. అవి కనిష్ఠంగా కొన్ని దశాబ్దాలు మన్నుతుండేవి. క్వార్ట్ జ్ టెక్నాలజీ, అంతర్జాతీయ డిజైన్లు, రీటైల్ షోరూమ్ లతో టైటన్ అరంగేట్రం చేసింది. అంతే వాచీల మార్కెట్ ను మేము ఆక్రమించుకున్నాం' అంటూ టైటన్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ భట్ గత సంగతులు నెమరువేసుకున్నారు. ఐఐటి మద్రాసు, ఐఐఎం అహ్మదాబాద్ పట్టభద్రుడైన భాస్కర్ భట్ కు టైటన్ వాచ్ ప్రాజెక్టుతో అనుబంధం 1983 నుంచి కొనసాగుతోంది.
అప్పటి నుంచి వాచీల వ్యాపారం నాలుగు ప్రధాన బ్రాండ్ ల ద్వారా సాగుతోంది. ఆ బ్రాండ్ లు - మిడి ప్రీమియం సెగ్మెంట్ లో టైటన్, యువజనులు, అత్యాధునిక ఫ్యాషన్ విభాగంలో ఫాస్ట్ ట్రాక్, మాస్ మార్కెట్ కు సొనాటా, ప్రీమియం మార్కెట్ కు జైలైస్. 'టైటన్ బ్రాండ్ కింద మేము రాగ, నెబ్యూలా, వాల్ స్ట్రీట్, హెరిటేజ్, రీగలియా, ఏవియేటర్ వంటి ఉప బ్రాండ్ ల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నాం' అని టైటన్ ఇండస్ట్రీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (వాచీలు) హరీష్ భట్ తెలియజేశారు. వివిధ ధరల శ్రేణుల్లో ఆఫర్లు ఇస్తుండడం వల్ల దేశంలో రూ. 2400 కోట్ల వ్యవస్థీకృత మాచ్ మార్కెట్ లో ఈ సంస్థ వాటా 60 శాతంపైగా ఉంది.
Pages: 1 -2- -3- News Posted: 22 February, 2010
|