టైటన్ చక్కని సవాల్
ఈ పంథాతో టైటన్ రూ. 80 వేల కోట్ల ఆభరణాల సెగ్మెంట్ లో నాలుగు శాతం మార్కెట్ వాటాను పొందగలిగింది. సంస్థ వాచీలకే ఎక్కువగా పేరు వచ్చినప్పటికీ ఆభరణాల వ్యాపారం పరిమాణమే భారీ వ్యాపారంగా మార్చింది. ప్రస్తుతం సంస్థ జ్యూయెలరీ డివిజన్ లో 115 తనిష్క్ స్టోర్లు, 29 గోల్డ్ ప్లస్ స్టోర్లు, రెండు జోయా స్టోర్లు ఉన్నాయి.
అయితే, ఈ సంస్థ ప్రయత్నాలన్నీ సత్ఫలితాలు ఇచ్చాయని చెప్పలేం. టైటన్ అంతర్జాతీయ లావాదేవీలు దెబ్బ తిన్నాయి. సంస్థకు యూరప్ లో నష్టాలు వచ్చాయి. సంస్థ 1990 దశకం ప్రారంభంలో యూరప్ లో 12 దేశాలలో తన వాచీల వ్యాపారాన్ని ప్రారంభించింది. కాని 2006 డిసెంబర్ లో ఆ రంగంలో నుంచి నిష్క్రమించింది. 2007 ఆర్థిక సంవత్సరంలో రూ. 110 కోట్ల మేరకు నష్టాలు వచ్చినట్లు టైటన్ తెలుసుకున్నది. ఆ మార్కెట్లలో స్విస్, జపనీస్ వాచీల పాపులారిటీతో పోటీ పడలేకపోవడం ఇందుకు కారణం. అదేవిధంగా, ఎన్ఆర్ఐలు తనిష్క్ ను అభిమానించడంతో 2008లో యుఎస్ లో ప్రవేశించి షికాగో, న్యూజెర్సీలలో రెండు తనిష్క్ షోరూములను ఏర్పాటు చేసింది. కాని ఆర్థిక మాంద్యం కారణంగా ఆ రెండు స్టోర్లను సంస్థ 2009లో మూసివేయవలసి వచ్చింది.
జ్యూయెలరీ విభాగం 30 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంటుండగా టైటన్ తన తాజా విభాగం 'టైటన్ ఐ ప్లస్'తో భారీ ఆలోచనలతో ముందుకు సాగుతున్నది. ఈ కళ్లజోళ్ల విభాగానికి 2007లో సంస్థ నాంది పలికింది. ఇప్పుడు దేశంలో 71 టైటన్ ఐ ప్లస్ షోరూములు ఉన్నాయి. ఈ వ్యాపారాన్ని ఇంకా విస్తరించాలని సంస్థ యోచిస్తున్నది. ప్రస్తుతం టైటన్ ఆదాయంలో అల్పమాత్రమే అయినప్పటికీ ఈ విభాగాన్ని వచ్చే మూడేళ్లో రూ. 500 కోట్ల బ్రాండ్ గా విస్తరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐవేర్ విభాగం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రవి కాంత్ తెలియజేశారు. లారెన్స్ మాయో, జికెబి ఆప్టికల్స్, విజన్ ఎక్స్ ప్రెస్ వంటి బ్రాండ్లు దేశంలో తమ ఉనికిని శీఘ్రంగా విస్తరించుకుంటున్నాయి.
కొత్త మార్కెట్ లో మరొక సారి తనకు సముచిత స్థానాన్ని సృష్టించుకోవడానికి టైటన్ కు ఇదే సరైన తరుణం కావచ్చు.
Pages: -1- -2- 3 News Posted: 22 February, 2010
|