ఖతర్నాక్ కత్రినా!
నలభైయవ పడిలోకి అడుగుపెట్టిన మనీషా అప్పట్లో 'ఫెరి భెతౌల' (మరోసారి కలుద్దాం) అనే చిత్రంలో తొలిసారిగా నటించింది. అయితే ఆ చిత్రం పూర్తి కాకపోవడంతో విడుదలకు నోచుకోలేదు. 'మదర్ ఇండియా' నేపాలీ రీమేక్ తో మళ్లీ నేపాలీ ప్రజలకు చేరువ కావాలని అప్పట్లో మనీషా అనుకున్నప్పటికీ అది కూడా కార్యరూపంలోకి రాలేదు. చాలాకాలం తర్వాత మనీషాను మళ్లీ నేపాలీ చిత్రంలో నటించేందుకు దీపేంద్ర ఒప్పించగలిగారు. అవినీతి పనులకు, అటవీ సామాగ్రి స్మగ్లింగ్ కు అలవాటుపడిన ఓ ఫారెస్ట్ రేంజర్ భార్యగా పవర్ ఫుల్ పాత్రను మనీషా ఈ చిత్రంలో పోషిస్తున్నారనీ, ఇటీవల ఖాట్మండులో జరిగిన ఓ డిన్నర్ లో మనీషాను కలిసి ఈ స్టోరీలైన్ చెప్పగానే ఆమె వెంటనే నటించేందుకు అంగీకరించారనీ దీపేంద్ర తెలిపారు.
మనీషా నేపాలీ రీఎంట్రీ చిత్రానికి సంబంధించి మరో ముచ్చట కూడా ఉంది. ఈ చిత్రానికి నిర్మాత అయిన దుర్గా ఫోఖ్రెల్ నేపాలీ రాజకీయవేత్త కూడా. నేపాలీ జాతీయ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ గా కూడా ఆమె వ్యవహరించారు. ఇక మనీషా తండ్రి ప్రకాష్ కొయిరాలా నేపాలీ రాయల్ కేబినట్ లో మంత్రిగా పనిచేశారు. 2006లో జరిగిన స్థానిక ఎన్నికల్లో నేపాలీ కింగ్ కు మనీషా మద్దతులు చెప్పడంతో మావోయిస్ట్ గెరిల్లాలు మనీషా పోస్టర్లను తగులబెట్టారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చిందని దీపేంద్ర తెలిపారు. మనీషాకు ఉన్న రాజకీయ అనుబంధాలకూ, ఈ చిత్రానికీ ఎలాంటి సంబంధంలేదనీ, ఇది పూర్తిగా కమర్షియల్ చిత్రమనీ ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రం కోసం ఖాట్మండులో ఇదే నెలలో మనీషాపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించామనీ, ఎలాంటి ప్రతిఘటనలు, నిరసనలు ఎదురు కాలేదనీ చెప్పారు. మనీషాతో పనిచేయడం ఒక అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ అనీ, బాలీవుడ్ లో తానో పెద్ద నటి అయినప్పటికీ ఎలాంటి భేషజాలు లేకుండా యూనిట్ సభ్యులతో మమేకమైందనీ సంబరంగా చెప్పారు. నేపాలీ తొలి ప్రధాని బి.పి.కొయిరాలా మనుమరాలు అయిన మనీషా సైతం నేపాల్ రాజకీయాల్లోకి రాబోతోందనే ప్రచారం కొద్దికాలంగా జరుగుతోంది. మనీషా అత్త సుజాత కొయిరాల నేపాల్ డిప్యూటీ ప్రధానిగానూ, ఆమె మేనమామలు ఇద్దరు ఎంపిలుగానూ ఉన్నారు. మనీషా ఇటీవల ఖాట్మండులో కొద్దిసేపు ఉన్నప్పుడు నేపాల్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలపై మీడియా తరచి తరచి ప్రశ్నించినప్పుడు మనీషా నవ్వుతూ నో చెప్పేసింది.
Pages: -1- 2 News Posted: 24 February, 2010
|