అడ్డం తిరిగిన ఐపిఎల్ కథ విజయవంతమైన బిడ్డర్ల నుంచి కోరిన 100 శాతం బ్యాంక్ గ్యారంటీని 10 శాతం రోలింగ్ బ్యాక్ గ్యారంటీకి తగ్గించామని, దీనిని 48 గంటలలోగా చెల్లించవలసి ఉంటుందని, ఇది మొదటి టెండరింగ్ ప్రక్రియలోని మొత్తానికి సమానమని ఆయన చెప్పారు. '225 మిలియన్ డాలర్ల బేస్ ధర యథాతథంగా ఉంటుంది. బేస్ ధరపై వివాదం లేదు' అని మోడి తెలిపారు.
టెండర్ రద్దు పట్ల తాను నిరాశ చెందినప్పటికీ, ఇది ఐపిఎల్ పాలక మండలి సమష్టి నిర్ణయమని ఐపిఎల్ చైర్మన్ చెప్పారు. 'నిజమే. నేను నిరాశ చెందాను. కాని ఇది పాలక మండలి నిర్ణయం' అని ఆయన చెప్పారు. ఐపిఎల్ కు మూడు బిడ్లు మాత్రమే అందాయని, వాటిలో ఒకటి వినిమయ వస్తువుల ఉత్పత్తిదారు వీడియోకాన్ అని, అది 300 మిలియన్ డాలర్లు బిడ్ చేసిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది. వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, టెండరింగ్ ప్రక్రియలో సూచించిన నిబంధనలను తమ సంస్థ పాటించిందని, అయినప్పటికీ తనకు 'ఎటువంటి ఫిర్యాదులూ లేవు' అని చెప్పారు. 'షరతులన్నిటినీ మేము పాటించినప్పటికీ నాకేమీ ఫిర్యాదులు లేవు. 21న నేను తిరిగి హాజరవుతాను' అని ఆయన తెలిపారు. రూ. 5 లక్షలు వంతున చెల్లించి టెండర్ పత్రాలు కొనుగోలు చేసిన వారు కావాలంటే ఆ మొత్తాన్ని వాపసు తీసుకోవచ్చునని, లేదా మంగళవారం జారీ చేయనున్న కొత్త టెండర్ పత్రానికి దానిని సర్దుబాటు చేయవచ్చునని కూడా లలిత్ మోడి సూచించారు.
Pages: -1- 2 News Posted: 8 March, 2010
|