సిరీస్ విజయం లక్ష్యం
వెల్లింగ్టన్: నేపియర్ లో బొంగరంలా తిరిగిన బంతులతో కివీస్ ను గింగరాలు తిప్పి జట్టును మళ్లీ విజయపథంలోకి మళ్లించిన 'టర్బొనేటర్' హర్భజన్ సింగ్ ఇప్పుడు గాల్లో తేలిపోతున్నాడు. విపరీతమైన నవేగంతో బంతి సీమ్ అవుతుందని అందరూ భయపడిన పిచ్ ల మీద ప్రత్యర్ధుల పరుగులకు అడ్డుకట్ట వేసి చౌకగా వికెట్లు కొట్టేయడం సాధ్యమేనని నిరూపించి చిరునవ్వులు చిందిస్తున్నాడు. ఈ టూర్ లో ఇంతవరకూ జరిగిన మ్యాచ్ ల్లో అతడు సాధించింది నిజంగా ఘనకార్యమే. మొదట్లో జరిగిన రెండు ట్వంటీ పోటీల్లో తన కోటా నాలుగేసి ఓవర్లలో అతడిచ్చినవి కేవలం 19, 15 పరుగులు మాత్రమే! ఆ తరువాత మొదటి వన్డే మ్యాచ్ లో నాలుగు ఓవర్లకు 27 పరగులిచ్చి మూడు వికెట్లు తీసుకుని, జట్టుకు హుషారిచ్చాడు.
హర్భజన్ నేపియర్ వన్డేలో పడగొట్టిన మూడు వికెట్లు కేవలం నాలుగు బంతులలోనే సాధించాడు. దురదృష్టవశాత్తు హ్యాట్రిక్ చేజారిపోయింది. బాగా సెటిల్ అయిపోయిన మార్టిన్ గుప్టిల్, నీల్ బ్రూమ్ వరసగా రెండు బంతులకు పెవిలియన్ చేరుకున్నారు. మూడో బంతికి కైల్ మిల్స్ వికెట్ దొరికేదే కాని, డిఫెన్స్ కోసం నిటారుగా పట్టుకున్న బ్యాట్ వెలుపలి ఎడ్జ్ ను బంతి వెంట్రుకవాసిలో మిస్ అయింది. అయితే ఆ తరువాత బంతికే మిల్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. టెస్ట్ క్రికెట్ లో హ్యాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారతీయ ఆటగాడిగా రికార్డుకెక్కిన హర్భజన్(కోల్ కటా టెస్ట్ లో ఆస్ట్రేలియాపై)నేపియక్ లో మిస్ అయినందుకు బాధపడ్డం లేదు. 'వన్డేల్లో కూడా హ్యాట్రిక్ లభించి వుంటే బాగుండేది కాని నాలుగు బంతులకే మూడు వికెట్లు పడగొట్టడం అంతకంటె ఆనందం కలిగించింది' అన్నాడతడు.
Pages: 1 -2- News Posted: 5 March, 2009
|