ఐపిఎల్ కు పవార్ ఆసరా
ముంబాయి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ పై కమ్ముకున్న అనిశ్చితి మేఘాలు ఇంకా తొలగిపోలేదు. పాటీలకు టెర్రరిస్టుల ముప్పు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడిస్తున్నప్పటికీ, పోటీలను ఏప్రిల్-మే నెలల్లో ఎలాగైనా నిర్వహించేందుకు లీగ్ అధికారులు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ)మాజీ అధ్యక్షుడు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ఐపిఎల్ కు పూర్తిగా సహకరిస్తున్నారు. ఐపిల్ పోటీల షెడ్యూలుకు అభ్యంతరం తెలియజేస్తున్న హోం శాఖ అధికారులతో పవార్ నేరుగా చర్చలు జరుపుతున్నారు. 'ఏ నిర్మయం తీసుకోవాలన్నా ఆయనే సరైన వ్యక్తి' అని ఐపిఎల్ ప్రతినిధి ఒకరు చెప్పారు.
ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లను తిరస్కరించినందు వల్ల ఐపిఎల్ రెండో సీజన్ రద్దయిపోయిందని వివిధ టివి చానెళ్లు ప్రకటించడంతో గందరగోళం నెలకొంది. అయితే ఐపిఎల్ అధికారులు ఈ పరిణామాన్ని నిజం కాదనంటూ తోసిపుచ్చారు. టివి వార్తలు ఎంతమాత్రం నిజం కాదని టోర్నమెంట్ డైరక్టర్ ధీరజ్ మల్హోత్రా అన్నారు. షెడ్యూలును సవరిస్తున్నామని, టోర్నమెంట్ జరిగితీరుతుందని చెప్పారు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వాలు అమకు అందుబాటులో ఉన్న వనరులతో, భద్రతా ఏర్పాట్ల బాధ్యతను స్వీకరిస్తే కేంద్రానికి ఎటువంటి అభ్యంతరం ఉండదని హోంశాఖ స్పష్టం చేసింది. కేంద్ర భద్రతా దళాల సహాయాన్ని రాష్ట్రాలు అడిగితేనే సమస్య తలెత్తుతుందని, ఎన్నికల విధుల నుండి భద్రతా దళాలను మళ్లించడం సాధ్యం కాదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఐపిఎల్ ఇప్పటికే సవరించిన షెడ్యూల్ ను హోంశాఖకు పంపించింది. అయితే, తమకు కేంద్ర దళాల సహాయం అవసరం లేదని లీగ్ స్పష్టం చేసినప్పటికీ, కొత్త షెడ్యూల్ హోంశాక అధికారులకు సంతృప్తికరంగా లేదని తెలిసింది.
Pages: 1 -2- News Posted: 6 March, 2009
|