రెండో వన్డే వర్షార్పణం
వెల్లింగ్టన్: ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షపు జల్లులు భారత, న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే పోటీని ఏ మాత్రం ముందుకు సాగనివ్వ లేదు. శుక్రవారం ఇక్కడి వెస్ట్ పాక్ స్టేడియంలో ప్రారంభమైన రెండో వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 19 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 130 పరగులు సాదించాక వర్షం ప్రారంభమయింది. అలాగే రెండుసార్లు ఆట తిరిగి ప్రారంభించాక భారత జట్టు 28.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరగులు చేశాక మరోసారి వర్షం అడ్డు పడింది. దీంతో అంపైర్లు రూడీ కోజెన్, ఇవాన్ వాట్కిన్ రాత్రి 8.15 నిముషాలకు ఆటను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మూడు సార్లు వర్షం వల్ల అంతరాయం కలగడంతో ఆటను 34 ఓవర్లకు కుదించారు. టామ్ ఇండియా 1-0 తో ఆధిక్యంలో ఉన్న ఈ సిరీస్ లో మూడో మ్యాచ్ క్రైస్ట్ చర్చ్ లో జరుగుతుంది.
వీరేంద్ర సెహ్వాగ్(54), సచిన్ టెండుల్కర్(61) దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించి మొదటి వికెట్ భాగస్వామ్యానికి 76 పరుగులు జోడించారు. ఎడమ కాలి కండరాలు బిగుసుకుపోవడంతో రన్నర్ సాయంతో బ్యాటింగుకు దిగిన సెహ్వాగ్ ఎప్పటిలాగే కివీస్ బౌలర్లను ముప్పతిప్పలు పెట్టాడు. కేవలం 36 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ తో, తన 31వ వన్డే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అంపైర్ వాట్కిన్ ్నుమానాస్పద(కాట్ బిహైండ్) నిర్ణయంతో సెహ్వాగ్ పెవిలియన్ కు చేరుకున్నప్పటికీ, ఇండియా రన్ రేట్ చెక్కు చెదరలేదు. గంభీర్(30), టెండుల్కర్ స్కోరు బోర్డును చకచకా పరుగులు తీయించారు. అప్పుడు వర్షం వల్ల ఆటకు 65 నిముషాల అంతరాయం ఏర్పడింది.
Pages: 1 -2- News Posted: 6 March, 2009
|