వెట్టోరి వీరోచిత సెంచరీ
హామిల్టన్: ధనా ధన్ క్రికెట్ అయిపోయింది. సీరియస్ గా ఆడాల్సిన సమయం వచ్చేసింది. వన్డే సిరీస్ లో సంచలన విజయం సాదించిన టీమ్ ఇండియా ఇప్పుడు న్యూజిలాండ్ లో టెస్ట్ క్రికెట్ రికార్డును మెరుగుపరచుకునే పనిలో పడింది. నిలకడగా ఆడుతూ వస్తున్న భ్యాట్స్ మెన్, బౌలర్లు అదే ఊపును కొనసాగించడానికి ఉవ్వీళ్లూరుతున్నారు. అలాగే న్యూజిలాండ్ కూడా వన్డే సిరీస్ చేదు అనుభవాన్ని జ్ఞాపకాల పొరల్లో దాచేసి, టెస్ట్ పోటీల్లో తాజాగా బరిలోకి దిగింది. కాని, బుధవారం ఇక్కడి స్నెడన్ పార్క్ లో ప్రారంభమైన తొలి టెస్ట్ లో కెప్టెన్ వెట్టోరి వీరోచితంగా ఆడి సెంచరీ చేయకపోతే, సొంత గడ్డ మీద కివీస్ పరువు గంగలో కలిసేదే. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్, తొలి ఇన్నింగ్సులో లంచి విరామ సమయానికే 61 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. ఓపెనింగ్ జంట మార్టిన్ గుప్టిల్, మెకింటోష్ జాగ్రత్తగా ఆడడం మొదలుపెట్టినా, 8 ఓవర్ల తరువాత 17 పరుగులకు మొదటి వికెట్ కోల్పోయింది.
జహీర్ ఖాన్ వేసిన అద్భుతమైన బంతిని గుప్టిల్ రెండో స్లిప్ లో వున్న రాహుల్ ద్రవిడ్ కు క్యాచ్ ఇచ్చాడు. వన్ డౌని గా వచ్చిన డి ఫ్లిన్ కూడా అదే స్కోరు వద్ద జహీర్ ఖాన్ బంతినే లెగ్ సైడ్ ఆడబోయి వికెట్ కీపర్ చేతికి చిక్కిపోయాడు. ఆ తరువాత వచ్చిన కాస్ టేలర్ కు గల్లీలో వున్న సెహ్వాగ్ 'లైఫ్' ఇచ్చాడు. మరో 27 పరుగుల తరువాత జహీర్ ఖాన్ కు మూడో వికెట్ లభించింది. రెండో ఓపెనర్ మెకింటోష్ (12) సెహ్వాగ్ కే క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఇప్పుడు ఇషాంత్ శర్మ వంతు. అద్భుతమైన ఇన్ స్వింగర్ తో రాస్ టోలర్ ఆఫ్ స్టంప్ ను ఎగరగొట్టేశాడు. అదే ఓవర్ లో జేమ్స్ ఫ్రాంక్లిన్ ను డకౌట్ చేశాడు. న్యూజిలాండ్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 51 పరుగులు.
Pages: 1 -2- News Posted: 18 March, 2009
|