ఫోర్'ట్వంటీ' ఎవరు?
ముంబాయి: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసిసిఐ)కు ఓర్పు నశించింది. ఇండియన్ ప్రీమియరం లీగ్(ఐపిఎల్) రెండో సీజన్ పోటీలను దేశ సరిహద్దులను దాటించలసి వచ్చింది. ఈ బలవంతపు నిర్ణయం తీసుకోడానికి ప్రభుత్వ వైఖరే కారణమన్నారు బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్. 'క్రికెట్ టోర్నమెంట్ కు భద్రతా దళాలను కేటాయించలేమనే ప్రభుత్వ వైఖరి వల్ల టోర్నమెంట్ ను వేరే దేశానికి మార్చాలన్న నిర్ణయం తీసుకోక తప్పింది కాదు' అని ఆయన మీడియాతో మాట్లాడుతూ వివరించారు. భద్రతా ఏర్పాట్లు మేం చూసుకుంటాం అని ఐపిఎల్ కమిషనర్ హోం మంత్రిత్వ శాఖకు నచ్చచెప్పడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. 'లోక్ సభ ఎన్నికల కంటె క్రికెట్ ముఖ్యం కాదు' అంటూ మోడీ ఆఫర్లను ప్రభుత్వం తిరస్కరించింది. చివరకు, రోజుల తరబడి సుదీర్ఘ చర్చల అనంతరం, మ్యాచ్ ల షెడ్యూల్ ను సుమారు నలభై సార్లు సవరించిన తరువాత, ఇంతవరకూ జరిగింది ఇక చాలుననుకున్నారు మోడీ.
లాహోర్ లో శ్రీలంక క్రికెటర్లపై సాయుధ దుండగుల దాడి నేపథ్యంలో ప్రభుత్వం భద్రత విషయంలో ఏ విధంగానూ రాజీ పడదలచుకో లేదు. అయితే అదే సమయంలో కోట్లాది రూపాయాల రెవెన్యూతో పాటు, వచ్చే యేడాది నిర్వహించనున్న కామన్వెల్త్ గేమ్స్ ను దృష్టిలో పెట్టుకుని, 'ఆటల పోటీలను నిర్వహించడానికి భారతదేశం సురక్షిత ప్రదేశం' అని నిరూపించుకునే అవకాశాన్ని చేజార్చుకుంది ప్రభుత్వం. ప్రభుత్వం తమకు మరో ప్రత్యామ్నాయం లేకుండా చేసిందని చెబుతూ బిసిసిఐ అధ్యక్షుడు ప్రజలకు, క్రీడాభిమానులకు క్షమాపణలు చెప్పుకున్నారు. ఐపిఎల్ టోర్నమెంట్ కోట్లాది రూపాయలతో ముడిపడి వున్న కార్యక్రమం అనీ, బిసిసిఐతో పాటు ఫ్రాంచైజీలు, బ్రాడ్ కాస్టర్లు అంత సొమ్ము నష్టపోడానికి సిద్ధంగా లేరనీ బోర్డు స్పష్టం చేసింది.
Pages: 1 -2- News Posted: 22 March, 2009
|