ఐపిఎల్ డీల్ 8200 కోట్లు!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్), సోని (ఇప్పుడు మల్టీ స్క్రీన్ మీడియా) ఎట్టకేలకు తమ కో్ర్టు వివాదానికి ముగింపు పలికాయి. ఈ రెండూ తమ ఇటీవలి వైమనస్యాలకు స్వస్తి పలికి టెలికాస్ట్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. తొమ్మిది సంవత్సరాల పాటు అంటే 2017 వరకు అమలులో ఉండే ఈ ఒప్పందం విలువ రూ. 8200 కోట్లు.
ఇది ఐపిఎల్, డబ్ల్యుఎస్ జి, ఎంఎస్ఎం మధ్య కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం. దీని వల్ల సోని సంస్థకు ఐపిఎల్ రెండవ సీజన్ లో మ్యాచ్ ల ప్రత్యక్ష ప్రసారానికి ప్రత్యేక హక్కులు లభిస్తాయి. ఐపిఎల్ రెండవ సీజన్ ఏప్రిల్ 18న దక్షిణాఫ్రికాలో ప్రారంభం కానున్నది. ఈ ఒప్పందం ప్రకారం, సోని మ్యాచ్ లను ఇండియాలో ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. అంతర్జాతీయంగా మ్యాచ్ ల ప్రసారం హక్కుల విక్రయాధికారం వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ (డబ్ల్యుఎస్ జి)కి ఉంటుంది.
Pages: 1 -2- News Posted: 26 March, 2009
|