రాయల్స్ 'సూపర్' విజయం
కేప్ టౌన్: ఐపిఎల్ రెండో సీజన్ లో గురువారం రెండో మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా జరిగింది. నిర్ణీత 20 ఓవర్లలో రెండు జట్లు సమానంగా స్కోరు(150) సాధించడంతో, తొలిసారిగా సూపర్ ఓవర్ నిబంధన అమలులోకి వచ్చింది. ఈ ఓవర్ లో కోల్కటా నైట్ రైడర్స్ ఒక వికెట్ నష్టానికి 15 పరుగులు చేయగా, డిఫెండింగ్ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ ఆ స్కోరును అధిగమించి విజయాన్ని కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు సాధించింది. గ్రీమ్ స్మిత్ 15, వల్తతి 5, క్వీనీ 6, యూసుఫ్ పఠాన్(మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్- 21 బంతులు, 7 ఫోర్లు, 2 సిక్సర్లు)42, రవీంద్ర జడేజా 22, మస్కరెనాస్ 27 రౌత్(నాటౌట్) 21, షేన్ వార్న్(నాటౌట్)2 పరుగులు చేశారు.
రైడర్స్ బౌలర్లలో ఇషాంత్ శర్మకు 2, అనురీత్ సింగ్ కు 2, మెండిస్ కు 2 వికెట్లు లభించాయి. తరువాత బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ లో క్రిస్ గేల్ 41, సౌరవ్ గంగూలీ 46 యశ్ పాల్ 20, మెకల్లమ్ 3,శుక్లా 13, హాడ్జ్ 5, బంగర్ 2, అగార్కర్(నాటౌట్)1, ఇషాంత్ 1 పరుగులు చేసి ప్రత్యర్ధి స్కోరుతో సమానం కాగలిగారు. రాయల్స్ బౌలర్లలో వార్న్ 2, కమ్రాన్ 3, మస్కరెనాస్, మునాఫ్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు. సూపర్ ఓవర్ అంటే...
Pages: 1 -2- News Posted: 23 April, 2009
|