డక్కన్ ఛార్జర్స్ 'హ్యాట్రిక్'
డర్బన్: ఐపిఎల్ రెండో సీజన్ లో డక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ జట్టు వరుసగా మూడో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో వుంది. గత సంవత్సరం టోర్నమెంట్ లో అట్టడుగు స్థానంలో వున్న ఛార్జర్స్ ఈ యేడాది ప్రత్యర్ధుల ఆటకట్టిస్తోంది. శనివారం ముంబై ఇండియన్స్ పై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన డక్కన్ ఛార్జర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 168 పరుగులు సాధించగా, ముంబాయి జట్టు ఇరవై ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్లు మాత్రమే కోల్పోయినా 156 పరుగులు మాత్రమే చేయగలిగింది.
డక్కన్ ఛార్జర్స్ జట్టులో హెర్షలీ గిబ్స్ ఈ మ్యాచ్ లో అత్యధిక స్కోరు, 58 పరుగులు, చేసి రనౌట్ అయ్యాడు. కెప్టెన్ గిల్ క్రిస్ట్ 35, డానే స్మిత్ 35, రోహిత్ శర్మ 3, వేణుగోపాలరావు 9, రవి తేజ 9, ఆర్పీ సింగ్ 4, ఎడ్వర్డ్స్ 1 పరుగులు చేయగా, వివిఎస్ లక్ష్మణ్, ప్రగ్యాన్ ఓఝా డకౌట్ అయ్యారు. ముంబాయి బౌలర్లలో లసిత్ మలింగ 3, డానే బ్రేవో 3, హర్భజన్ సింగ్, జయసూర్య చెరొకటి వికెట్లు పడగొట్టారు.
Pages: 1 -2- News Posted: 25 April, 2009
|