యువరాజ్ హ్యాట్రిక్ నిష్ఫలం!
డర్బాన్: గత సంవత్సరం ఐపిఎల్ టోర్నమెంట్ లో ఒక ఓవర్ లో ఆరు సిక్సర్లు కొట్టి సంచలనం సృష్టించిన యువరాజ్ సింగ్, ఈ యేడాది రెండో సీజన్ లో మొట్టమొదటి హ్యాట్రిక్ సాధించాడు. అయితే బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ పై అతడు సాధించిన హ్యాట్రిక్ తోపాటు హాఫ్ సెంచరీ కూడా కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టుకు విజయం చేకూర్చలేకపోయాయి. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్ లో బెంగుళూరు జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసి రాయల్ ఛాలెంజర్స్ జట్టును 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులకు పరిమితం చేయగలిగిన పంజాబ్ బౌలర్లు యూసుఫ్ అబ్దుల్లా పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా 4 ఓవర్లలో 22 పరుగులకు యువరాజ్ 3 పరుస వికెట్లు తీసుకున్నాడు. ఇర్ఫాన్ పఠాన్ 2 వికెట్లు పడగొట్టాడు. బెంగుళూరు బ్యాట్స్ మెన్ లో అత్యధిక పరుగులు చేసినవాడు వాన్ డెర్ మెర్వ్(35- 19 బంతులు, 3 ఫోర్లు, 3 సిక్సర్లు). జెస్సీ రైడర్ 2, గోస్వామి 10, బిష్నోయ్ 18, జాక్స్ కాలిస్ 27, రాబిన్ ఉతప్ప 19, కొహ్లి 16, మార్క్ బౌచర్ 2, ప్రవీణ్(నాటౌట్) 9, అనిల్ కుంబ్లె 1, అప్పన్న(నాటౌట్)0 పరుగులు చేశారు.
Pages: 1 -2- News Posted: 1 May, 2009
|