ఫైనల్స్ లో చార్జర్స్
సెంచురియన్: డక్కన్ చార్జర్స్ కెప్టెన్ ఆడమ్ గిల్ క్రిస్ట్ మరోసారి తన అసమాన బ్యాటింగ్ ప్రతిభను ప్రదర్శించాడు. గిల్లీ మొదటి బంతి నుంచే ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేశాడు. దక్కన్ ఛార్జర్స్‌ను టైటిల్ పోరులో నిలిపాడు. బంతులను నిర్దయగా చితక్కొట్టాడు. ఐపిఎల్ చరిత్రలో వేగవంతమైన అర్ధసెంచరీ(17బంతుల్లో) చేశాడు. దక్కన్ ఛార్జర్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లాడు. గిల్‌క్రిస్ట్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో దిక్కుతోచని స్థితిలో భీతిల్లిన ఢిల్లీ 6 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. తమ కథ సెమీస్‌తోనే ముగిసిందని సరిపెట్టుకుంది. గత సీజన్‌లోనూ ఢిల్లీ సెమీస్‌లోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 153/8 స్కోరు చేసింది. మళ్లీ దిల్షాన్(65) రాణించగా, సెహ్వాగ్(39) మెరిశాడు. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యమే అయినా గిల్‌క్రిస్ట్ ఏకపక్షంగా గెలిపించాడు. దక్కన్ ఛార్జర్స్ 17.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి అధిగమించింది. గిల్‌క్రిస్ట్ వీరబాదుడుకు మైదానం చిన్నదైంది. లక్ష్యం కుదించుకుపోయింది. ఒక ఓవర్లో వరుసబెట్టి ఫోర్లు... మరో ఓవర్లో వరుసబెట్టి సిక్సర్లు బాదాడు. 17 బంతుల్లో(8్ఠ4, 2్ఠ6) ఫిఫ్టీ చేసిన గిల్లీ 35 బంతుల్లో 85(10్ఠ4, 5్ఠ6) పరుగులు చేశాడు. గిబ్స్(0) విఫలమైనా... గిల్‌క్రిస్ట్ ఊచకోతకు ఢిల్లీ విలవిలలాడింది. మిగిలిన లాంఛనాన్ని సుమన్(24), సైమండ్స్(24) పూర్తి చేశారు. గిల్‌క్రిస్ట్ తాను క్రీజ్‌లో ఉన్నంత వరకూ ఓవర్‌కు 12 చొప్పున రన్‌రేట్‌తో స్కోరుబోర్డును ఉరకలెత్తించాడు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు.
Pages: 1 -2- News Posted: 22 May, 2009
|