ఫైనల్లో చాలెంజర్స్
జోహన్నెస్‌బర్గ్: గత ఏడాది ఐపిఎల్ టోర్నీ పాయింట్ల టేబుల్ లో అట్టడుగున ఉన్న జట్లు ఈ ఏడాది ఐపిఎల్ లో సంచలన విజయాలు సాధించి ఫైనల్స్ లో తలపడనున్నాయి. పటిష్టమైన టీమ్ గా పరిగణిస్తూ వచ్చిన చెన్నైకి చెక్ చెప్పిన బెంగళూరు ఫైనల్లో ప్రవేశించింది. దక్కన్‌తో అమితుమీ తేల్చుకునేందుకు బరిలో నిలిచింది. మనిష్ పాండే(48) పరుగులు మళ్లీ బెంగళూరుకు విజయదీపికలయ్యాయి. మిస్టర్ డిపెండబుల్ ద్రవిడ్(44), పాండేతో కలిసి జట్టును విజయధరికి చేర్చాడు. పాండే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు. బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తమ ముందుంచిన లక్ష్యాన్ని మరో ఓవర్ మిగిలుండగానే కేవలం నాలుగే వికెట్లు కోల్పోయి18.5 ఓవర్లలోనే ఛేదించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన చెనై్న నిర్ణీత 20 ఓవర్లలో 146/5 స్కోరు చేసింది. పార్థివ్ పటేల్(36), హేడెన్ 26, ధోనీ 28 పరుగులు చేశారు. వినయ్‌కుమార్ 2 వికెట్లు తీసుకున్నాడు.
ధాటైన ఇన్నింగ్స్‌తో బెంగళూరును సెమీస్‌కు చెర్చిన మనిష్, మళ్లీ రాణించి ఫైనల్‌కు చేర్చాడు. అపుడు దక్కన్ బౌలర్లకు ఎదురొడ్డి నిలిచిన మనిష్ తాజా మ్యాచ్‌లో చెనై్న బౌలింగ్‌నూ తుత్తునియలు చేశాడు. కలీస్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన పాండే బౌండరీతో పరుగుల శ్రీకారం చుట్టాడు. మరోవైపు కలీస్(9) ఇన్నింగ్స్‌కు గోనీ, వాన్‌డర్‌మెర్వ్(2) ఇన్నింగ్స్‌కు మొర్కెల్ ఆదిలోనే తెరదించినప్పటికీ మనిష్ మాత్రం తన పరుగుల జోరును ద్రవిడ్‌తో కలిసి కొనసాగించాడు. ఈ జూనియర్-సీనియర్‌లు ప్లేసింగ్ షాట్లతో బౌండరీలు బాదారు. జట్టు స్కోరును క్రమం తప్పకుండా రన్‌రేట్‌తో పాటే పెంచారు. అలా పది ఓవర్ల బ్రేక్ వరకు మరో వికెట్ పడకుండా స్కోరును 82కు చేర్చారు. ఆ తర్వాత 94 పరుగుల జట్టు స్కోరు వద్ద పాండే 48(35 బంతులు, 7ఫోర్లు) జకాటి బౌల్డ్ చేశాడు. కాసేపటికి ద్రవిడ్(44) మురళీధరన్ బౌలింగ్‌లో నిష్ర్కమించినప్పటికీ చివర్లో కోహ్లీ 24 (1్ఠ4, 2్ఠ6), టేలర్ 17(2్ఠ6) అజేయమైన మెరుపులు జట్టును గెలిపించాయి.
Pages: 1 -2- News Posted: 23 May, 2009
|