బాద్షాపై తగ్గనున్న భారం
ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో 'మాంచెస్టర్ యునైటెడ్' తనకు కొంత ఎక్కువ విలువనే ఆపాదించుకున్నది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, ఆయన మిత్రుల యాజమాన్యంలోని ఐపిఎల్ జట్టు కోలకతా నైట్ రైడర్స్ (కెకెఆర్) తన వాటాలను బహుశా జూన్ లోగా పది నుంచి ఇరవై శాతం వరకు తగ్గించుకోవాలనుకుంటున్నది.
ఈ సీజన్ లో ఎనిమిది జట్లలో కట్టకడపటి స్థానంలో నిలచిన కోలకతా ఫ్రాంచైజీ తన స్టార్, గ్లామర్ కారణంగా అత్యధిక బ్రాండ్ విలువను కొనసాగించుకుంటున్నది. క్రీడా ప్రపంచంలో 'మాంచెస్టర్ యునైటెడ్', ప్రముఖ బాస్కెట్ బాల్ జట్టు 'లాస్ ఏంజెలిస్ లేకర్స్' వంటి ఐదు అగ్రశ్రేణి ఫ్రాంచైజీలలో ఒకటిగా తన జట్టును తీర్చిదిద్దాలనేది షారుఖ్ ఆకాంక్ష అని తెలుస్తున్నది.
ఉదాహరణకు, సెమీ ఫైనల్స్ కు చేరుకోలేకపోయినప్పటికీ కెకెఆర్. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ జట్లు అంతర్జాతీయ క్రికెట్ అభిమానుల దృష్టిలో ఆన్ లైన్ వ్యాపార సంస్థలలో అగ్రస్థానాలలో ఉన్నట్లు ఆన్ లైన్ షాపింగ్ కంపెనీ 'ఇబే' విడుదల చేసిన డేటా వల్ల తెలుస్తున్నది. అయితే, కెకెఆర్ జట్టు యజమానులు కొనుగోలుదారును చూడాలనుకుంటే జట్టు విలువను తిరిగి మదింపు వేయవలసి ఉంటుందని ఆర్థిక నిపుణులు కొందరు సూచిస్తున్నారు.
'కెకెఆర్ వాస్తవ ప్రపంచంలోకి రావలసిన అవసరం ఉంది. వారికి క్రితం సంవత్సరం ఉన్నంత విలువ లేదు. బ్రాండ్ షారుఖ్ తో కేవలం సంబంధం ఉండడం కెకెఆర్ విలువను పెంచదు. వాస్తవానికి ఆయన బ్రాండ్ అప్పీలే ఇప్పుడు గరిష్ఠ స్థాయిలో లేదు. పెట్టుబడిదారులు ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్టార్ విలువను కాకుండా వ్యాపారం లాభసాటా కాదా అని చూస్తారు. ఎస్ఆర్ కె ఆశలు కొంత అవాస్తవికంగా ఉన్నాయి. అందువల్ల మేము వెనుకకు తగ్గాం' అని టిపిజి కాపిటల్ సంస్థ ప్రతినిధి ఒకరు తెలియజేశారు. ఈ సంస్థను ఇంతకుముందు టెక్సాస్ పసిఫిక్ గ్రూప్ గా పేర్కొనేవారు. నైట్ రైడర్స్ లో వాటా కోసం ఈ సంస్థ జట్టు యజమానులతో సంప్రదింపులు సాగించింది.
ఈ విషయమై షారుఖ్ అభిప్రాయం తెలుసుకోవడానికి మీడియా ప్రయత్నించినప్పుడు ఆయన అందుబాటులో లేరు. కాగా ఈ ఫ్రాంచైజీకి యజమానులు మదింపు వేసిన విలువ గురించి వెల్లడించడానికి ఎవరూ సుముఖంగా లేరు.
షారుఖ్ ఖాన్ తన రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ ద్వారాను, మిత్రులు జయ్ మెహతా, నటి జూహీ చావ్లాలతో కలసి 2008 జనవరిలో కోలకతా ఫ్రాంచైజీని 75 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. కాగా, అంతర్జాతీయ మదింపు సంస్థలు కెకెఆర్ ప్రస్తుత విలువను 42.1 మిలియన్ డాలర్లు, 22 మిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. ఈ విలువ 45 శాతం నుంచి 70 శాతం వరకు తగ్గిపోయింది.
Pages: 1 -2- News Posted: 26 May, 2009
|