వీరూతో వైరం లేదు: ధోనీ
నాటింగ్‌హమ్: టీమిండియాలో ఆటగాళ్ల మధ్య విభేదాలు ఉన్నాయని మీడియాలో వచ్చిన కథనాల్లో నిజం లేదని జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ కొట్టి పారేశాడు. ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధోనీ మాట్లాడాడు. వైస్ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్‌తో తనకు మనస్పర్థాలు తలెత్తాయని, అందువల్లే అతన్ని పక్కన బెట్టారని మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నాడు. తనకు ఎవరితోనూ వైరం లేదన్నాడు. జట్టు సభ్యులంతా కలసికట్టుగా ఉన్నారని, అందరి లక్ష్యం భారత్‌కు కప్‌ను సాధించి పెటడమేనన్నాడు.
ముఖ్యమైన టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ఇటువంటి కథనాలు జట్టు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని, దీనికి మీడియా దూరంగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు. సెహ్వాగ్‌తో తనకు చెడిందని, అందువల్లే అతన్ని ఆడించడం లేదని వచ్చిన వార్తల్లో పసలేదన్నాడు. జట్టులో ప్రతి ఒక్క ఆటగాడు కీలకమేనని, అందరు కలసికట్టుగా ఆడితేనే విజయాలు సాధ్యమవుతాయన్నాడు. వార్మప్ మ్యాచ్‌లకు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతోనే సెహ్వాగ్‌ను పక్కన పెట్టడం జరిగిందని, అంతకుమించి వేరే అంశం ఏమీలేదన్నాడు.
Pages: 1 -2- News Posted: 5 June, 2009
|