పొగరు తలకెక్కిందా!
హాట్ ఫెవరిట్...ప్రపంచంలోనే భీకర జట్టన్న పేరు... మళ్లీ టైటిల్ మనదే అనే మాజీల ప్రశంసలు... డిఫెండింగ్ ఛాంపియన్‌కు తలకెక్కినట్లు ఉన్నాయి. ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిచించే ఆటగాళ్లు జట్టులో పుష్కలంగా ఉన్నరన్న ధీమానో... అతివిశ్వాసమో గానీ శుక్రవారం రాత్రి మాత్రం భారత్ లెక్కతప్పింది. క్రికెట్ మక్కా లార్డ్‌సలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచే భారత్ ఆటతీరుకు నిదర్శనం. ఈ మ్యాచ్‌ను తిలకించిన ప్రతి ఒక్కరూ... భారత్‌ను వెస్టిండీస్ ఓడించలేదు... భారతే వెస్టిండీస్‌ను గెలిపించింది అన్న విషయం తెలుస్తొంది.
గేల్..గేల్...అంటూ జట్టు మొత్తం అతన్ని ఎలా కట్టడిచేయాలనే పనిలో పడి మిగిలిన విషయాలు మర్చిపోయారు. దీనికి ధోనీ సేన తగిన మూల్యమే చెల్లించుకొంది. టోర్నీ ఆరంభం నుంచి ఓ డిఫెండింగ్ ఛాంపియన్ తన స్థాయికి తగినట్లుగా ఆడలేకపోయింది. ఈ విషయం లీగ్‌లో బంగ్లాదేశ్‌తో తెలిసినా... విండీస్‌తో మ్యాచ్‌తో నిర్ధారణ అయింది. చచ్చి బతికినట్లు యువరాజ్, ఓజా పుణ్యమా బంగ్లాపై ఎలాంటి సంచనాలు లేకుండా నెగ్గినా...బ్రావో చేతిలో చావుదెబ్బతింది. ఐపీఎల్‌లో విశేష అనుభవం ఉన్న మన టాప్ ఆర్డర్ ఆటగాళ్లు బ్రావో, ఎడ్వర్డ్‌స, బెన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు తంటాలు పడ్డారు. నిజానికి పవర్‌ప్లేను సమర్థవంతంగా ఉపయోగించుకునే ఓపెనరే కరువయ్యాడు.
సెహ్వాగ్ లాంటి విధ్వంసక బ్యాట్స్‌మెన్ టోర్నీ నుంచి వైదొలిగితే మనకు రోహిత్ ఎలా ప్రత్యామ్నాయం ఎలా అయ్యాడోఅవుతాడో ధోనీయే చెప్పాలి. అయితే రోహిత్ ప్రాక్టీస్ మ్యాచుల్లో అదరగొట్టినా బంగ్లాతో వేగంగా 36 పరుగులు చేయగలిగాడు గానీ...అలసత్వంతో నిర్లక్ష్యపు షాట్ కొట్టి వెనుదిరిగాడు. విండీస్‌పై ఎడ్వర్డ్‌స వేసిన ఓ షాట్‌పిచ్ బంతిని నిర్లక్ష్యంగా కొట్టి అవుట్ అయిన తీరు దారుణంగా ఉంది. ఇక రైనా, గంభీర్‌లు కూడా ఇదే పరిస్థితి.
Pages: 1 -2- News Posted: 13 June, 2009
|