పరాజయాల హ్యాట్రిక్
నాటింగ్‌హామ్: సూపర్ ఎయిట్‌లో భారత్ పూర్ ఫైట్‌కు మూల్యం చెల్లించు కుంది. ముచ్చటగా మూడు మ్యాచుల్లోనూ పరాజయాన్నే మూటగట్టుకుంది. పరాజయంతో(ప్రాక్టీసు మ్యాచ్) మొదలైన భారత ప్రపంచకప్ పోరాటం పరాజయంతోనే ముగిసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్-8 చివరి మ్యాచ్‌లో భారత్ 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. బౌలర్ల శ్రమను బ్యాట్స్‌మెన్ మళ్లీ నీరుగార్చారు. ఏ ఒక్కరూ క్రీజ్‌లో నిల్చున్నా గెలిచే మ్యాచ్‌లో అందరూ చేతులెత్తే శారు. ఓపెనర్ రోహిత్ శర్మ చేసిన 29 పరుగులే ఇన్నింగ్స్ టాప్ స్కోరు అంటే పరిస్థితేంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. గంభీర్ (21), యువరాజ్(25) పర్లేదనిపించారు. సఫారీలేమో భారత్‌ను ఓడించారు.
దక్షిణాఫ్రికా తమముందుంచిన 131 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 118/8 స్కోరే చేయగల్గింది. ఓపెనర్ గ్రేమ్ స్మిత్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ డివిలియర్స్ అర్దసెంచరీతో కదం తొక్కడంతో సఫారీ నిర్ణీత 20 ఓవర్లలో 130/5 స్కోరు చేసింది. ఎట్టకేలకు ఎనిమిది మంది బౌలర్లు కలిసి సఫారీని కట్టడి చేయడంలో సఫలమయ్యారు. అంతకుముందు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ముందు పరుగుపెట్టేందుకే నిర్ణయించుకుంది. గిబ్స్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన స్మిత్ దూకుడు ప్రదర్శించాడు. అయితే ఆర్పీ సింగ్ తాను వేసిన తొలి ఓవర్లోనే గిబ్స్(5)ను బోల్తా కొట్టించాడు. దీంతో 13కే తొలివికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికాను మరో వికెట్ పడకుండా స్మిత్, డివిలియర్స్ జాగ్రత్త పడ్డారు. దీంతో దక్షిణాఫ్రికా 6.3 ఓవర్లలో 50 పరుగులు చేసింది.
దీనికి కాసేపటికే స్మిత్(26) హర్భజన్ బౌలింగ్‌లో నిష్ర్కమించాడు. తర్వాత డుమిని, డివిలియర్స్‌కు జతయ్యాడు. 10 పరుగులు చేసిన డుమిని రైనా బౌలింగ్‌లో స్టంపౌటై వెనుదిరిగాడు. 41 బంతుల్లో (6్ఠ4) అర్ధసెంచరీ చేసిన డివిలియర్స్‌ను 63 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద జడేజా రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా 130/5 స్కోరు చేసింది.
స్కోరు బోర్డు : దక్షిణాఫ్రికా: గ్రేమి స్మిత్ (సి)జడేజా (బి)హర్భజన్ 26, గిబ్స్ (బి) ఆర్పీ సింగ్ 5, డివిలియర్స్ (సి అండ్ బి) రవీంద్ర జడేజా 63, డుమిని (స్టంప్డ్) ధోనీ (బి)రైనా 10, బౌచర్ (సి) ఆర్పీ సింగ్ (బి)జహీర్ ఖాన్ 11, మొర్కెల్ నాటౌట్8, బోతా నాటౌట్ 4, ఎక్స్‌ట్రాలు 3, మొత్తం (20 ఓవర్లలో) 130/5
బౌలింగ్: జహీర్‌ఖాన్ 3-0-26-1, ఆర్పీ సింగ్ 2-0-21-1, ఇషాంత్ శర్మ 1-0-6-0, రవీంద్ర జడేజా 3-0-9-1, రోహిత్ శర్మ 2-0-15-0, యువరాజ్ 4-0-25-0, హర్భజన్ 4-0-20-1, సురేశ్ రైనా 1-0-6-1
భారత్: గంభీర్ (సి)డుమిని (బి)బోతా 21, రోహిత్ శర్మ (సి)స్టెయిన్ (బి)డుమిని 29, రైనా (సి)మొర్కెల్ (బి)బోతా 3, యువీ (సి) బౌచర్ (బి) స్టెయిన్ 25, ధోనీ రనౌట్ 5, యూసుఫ్ పఠాన్ (సి)డివిలియర్స్ (బి)వాన్‌డర్‌మెర్వ్ 0, హర్భజన్ (సి)డివిలియర్స్ (బి)బోతా 14, జడేజా నాటౌట్ 7, జహీర్ (సి) డివిలియర్స్ (బి) స్టెయిన్ 4, ఆర్పీసింగ్ నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు 8, మొత్తం ( 20 ఓవర్లలో) 118/8
బౌలింగ్: స్టెయిన్ 2-0-20-0, పార్నెల్ 2-0-15-0, ఎం.మొర్కెల్ 4-0-23-0, జె.ఎ.మొర్కెల్ 1-0-12-0, బోతా 4-0-11-4, వాన్‌డర్‌మెర్వ్ 4-0-13-1, డుమిని 1-0-3-1
News Posted: 16 June, 2009
|