ఫైనల్స్ లో పాక్ తో లంక ఢీ
లండన్: ఈ ట్వంటీ-20ఫెనల్లోనూ ఉపఖండం జట్లే తలపడుతున్నాయి. గత ప్రపంచకప్‌లో తలపడిన పాక్‌తో లంక టైటిల్ పోరు జరుపనుంది. శనివారం జరిగిన రెండో సెమీస్‌లో శ్రీలంక 57 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనంతరం 159 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 17.4 ఓవర్లలో 101 పరుగులకే చేతులెత్తేసింది. గేల్(63 నాటౌట్)మినహా ఎవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. మ్యాథ్యూస్ (3/16), మురళీ దరన్ (3/29), మెండీస్(2/9) విండీస్ బ్యాట్స్‌మె న్‌ను కట్టడి చేశారు. మ్యాథ్యూస్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే విండీస్‌ను చావుదెబ్బ తీశాడు. ఓపెనర్ మార్షల్(0)ను, తర్వాత సిమండ్స్(0), బ్రేవో(0)లను బౌల్డ్ చేశాడు. ముగ్గురూ డకౌట్ అయ్యారు. విండీస్ 1కే 3 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
తర్వాత ఓపెనర్ క్రిస్ గేల్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్‌తో కలిసి ఒంటరి పోరాటం చేశాడు. అనుభ వజ్ఞుడెైన చందర్‌పాల్ కాసేపు క్రీజ్‌లో నిలిచిన ప్పటికీ రెండంకెల స్కోరు చేయలేకపోయాడు. 15 బంతుల్లో 7 పరుగులు చేసిన చందర్‌పాల్‌ను స్పిన్నర్ అజంత మెండీస్ పెవిలియన్ చేర్చాడు. తర్వాత రాంనరేశ్ శర్వాన్ కూడా విఫలమ య్యాడు. శర్వాన్(2)ను ముత్తయ్య మురళీధరన్ పెవిలియన్ చేర్చాడు.
టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకోగా, శ్రీలంక ఇన్నింగ్స్‌ను దిల్షాన్(96 నాటౌట్), జయసూర్య(24) ప్రారంభించారు. ఏకంగా పది ఓవర్ల వరకు విండీస్ బౌలర్లకు వికెట్ చిక్కకుండా చక్కని శుభారంభమిచ్చారు. ముఖ్యంగా డాషింగ్ ఓపెనర్ జయసూర్య కుదురుగా ఆడుతుంటే, దిల్షాన్ మాత్రం చెలరేగాడు. ఓవర్‌కు 6 పరుగుల సగటున లంక స్కోరు వేగం సాగింది. ఈ క్రమంలోనే శ్రీలంక 7.5 ఓవర్లలో 50 పరుగులు పూర్తి చేసింది. తొలి వికెట్‌కు 73 పరుగులు జోడించిన అనంతరం జయసూర్య వికెట్‌ను బ్రేవో నేలకూల్చాడు. జయసూర్య 37 బంతుల్లో (3్ఠ4) 24 పరుగులు చేసి వెనుదిరిగాడు. అదే ఓవర్లో బ్రేవో, కెప్టెన్ సంగక్కరను పెవిలియన్ చేర్చాడు.
పొలార్డ్ అద్భుతమైన క్యాచ్‌తో సంగక్కర డకౌటయ్యాడు. దీంతో 73కే 2 వికెట్లను కోల్పోయింది. తర్వాత మరుసటి ఓవర్లో మరో దెబ్బ జయవర్ధనె రూపంలో తగిలింది. జట్టు స్కోరు 77 పరుగుల వద్ద జయవర్ధనె(2) పొలార్డ్ బౌలింగ్‌లో చందర్‌పాల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో లంక స్కోరు వేగం ఒక్కసారిగా మందగించింది. దిల్షాన్ 30 బంతుల్లో (5్ఠ4, 2్ఠ6) అర్ధసెంచరీ పూర్తి చేశాడు. చమరసిల్వతో కలిసి జట్టు స్కోరును వంద పరుగులు దాటించాడు. భారీ షాట్లతో విరుచుకుపడిన దిల్షాన్ డజను బౌండరీలు బాదాడు. సెంచరీకి సమీపించాడు. స్లాగ్ ఓవర్లలో జట్టు స్కోరు పెంచే ప్రయత్నంలో చమరసిల్వ(11) బెన్ బౌలింగ్‌లో నిష్ర్కమించాడు. తర్వాత వచ్చిన ముబారక్(7)ను టేలర్ పెవిలియన్ చేర్చాడు. చివర్లో మ్యాథ్యూస్ 12(1్ఠ4,1్ఠ6) పరుగులతో, దిల్షాన్ 96(12్ఠ4, 2్ఠ6) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.లంక158/5 స్కోరు చేసింది.
స్కోరుబోర్డు:
శ్రీలంక: దిల్షాన్ నాటౌట్ 96, జయసూర్య (సి)టేలర్ (బి)బ్రేవో 24, సంగక్కర (సి)పొలార్డ్ (బి)బ్రేవో 0, జయవర్ధనె (సి)చందర్‌పాల్ (బి)పొలార్డ్ 2, చమరసిల్వ (సి)రామ్‌దిన్ (బి)బెన్ 11, ముబారక్ (సి)సమ్మి (బి)టేలర్ 7, మ్యాథ్యూస్ నాటౌట్ 12,ఎక్స్‌ట్రాలు 6,మొత్తం (20 ఓవర్లలో) 158/5
బౌలింగ్:సమ్మి 4-0-19-0, టేలర్ 4-0- 31-1, బ్రేవో 3-0-32-2, బెన్ 4-0-24-1, గేల్ 3-0-35-0, పొలార్డ్ 2-0-14-1
వెస్టిండీస్ (సంక్షిప్త స్కోరు): 17.4 ఓవర్లలో 101 ఆలౌట్ (క్రిస్‌గేల్ నాటౌట్ 63, రామ్‌దిన్ 0, చందర్‌పాల్ 7; మ్యాథ్యూస్ 3/16, మురళీధరన్ 3/29), మెండీస్ 2/9)
News Posted: 19 June, 2009
|