అంతిమ పోరాటం నేడే
లండన్: సంక్షోభంలో ఉన్న పాక్ క్రికెట్‌ను యూనిస్‌ఖాన్ సారథ్యంలో యువ ఆటగాళ్లతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిన పాకిస్థాన్ జట్టు ప్రపంచ చాంపియన్‌గా అవతరించి తమ జాతికి గిప్ట్‌గా ఇవ్వాలని భావిస్తోంది. మరోవెైపు టోర్నీ ఆరంభం నుంచి ఓటమి లేకుండా బరిలోకి దిగిన ప్రతిసారి ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెడుతూ తొలిసారిగా శ్రీలంక ఫెైనల్‌కు చేరింది. మరోసారి రెండు ఆసియా దేశాల మధ్య జరుగుతున్న ఈ మహాసంగ్రామంలో చివరి వరకు ఒత్తిడిని అధిగమించే జట్టునే చాంపియన్స్ హోదా దక్కనుంది.
ఐపీఎల్ టోర్నీ నుంచి అద్భుతమైన ఫాంతో ప్రత్యర్థి ముచ్చెమటలు పట్టిస్తున్న దిల్షాన్ జోరుతో శ్రీలంక జెైత్రయాత్ర కొనసాగుతుంది. దిల్షాన్ టోర్నీలో ఆడిన ఆరు మ్యాచుల్లో 63.4 సగటుతో 317 పరుగులతో ముందున్నాడు. సెమీస్‌లో విండీస్ బౌలర్లతో ఆటాడుకున్న దిల్షాన్ 96 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోసారి వీరవిహారం చేస్తే పాక్ బౌలర్లకు ముచ్చెటమలు తప్పవేమో! సంగక్కర, జయసూర్య, జయవర్ధనేలు కూడా ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. ఇక బౌలింగ్ విషయానికి మలిం గ, మథ్యూస్ పేస్ బౌలింగ్‌లో మెండీస్, మురళీధరన్ స్పిన్‌తో ప్రత్యర్థిని ముప్పతిప్పలు పెడుతున్నారు. సెమీస్‌లో తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు తీసి విండీస్ నడ్డివిరిచిన మథ్యూస్ జోరుమీదున్నాడు.
పాకిస్థాన్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిది ఫాంలోకి రావడం ఆ జట్టుకు ఎక్కడ లేని పవన్ వచ్చింది. అటు బౌలింగ్‌తోను, ఇటు బ్యాటింగ్‌లో సత్తా చాటి దక్షిణాఫ్రికాపెై విజయాన్ని అందించాడు. టోర్నీ మొత్తంలో పాక్ బ్యాటింగ్ కంటే బౌలింగ్‌తోనే నెట్టుకొచ్చింది. ఉమర్‌గుల్ నిప్పులు చెరిగిస్తున్నాడు. టోర్నీలో ఇప్పటికే అత్యధిక గుల్ (12) అత్యధిక వికెట్లు తీసుకొని ముందున్నాడు. మరోవెైపు స్పినర్ అజ్మల్ కూడా తన మాయాజాలంతో ప్రత్యర్థిని ముప్పతిప్పలు పెడుతున్నాడు. ఆల్‌రౌండర్ రజాక్ చేరికి జట్టుకు చాలా లాభించింది. ఓపెనర్ అక్మల్ కుదురుగా ఆడుతూ... జట్టుకు శుభారంభం ఇస్తున్నాడు. షోయబ్‌మాలిక్, యూనిస్‌ఖాన్‌తో పాటు మిస్బావుల్‌లతో పాక్ బ్యాటింగ్ బలంగా ఉంది. చిచ్చరపిడుగు అఫ్రిది మరోసారి రెచ్చిపోతే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. టోర్నీలో ఒక పరాజయంతో పాక్ ఫెైనల్‌కు చేరింది. గత ప్రపంచకప్‌లో చివరిమెట్టు వద్ద ధోనీ సేన చేతిలో చావుదెబ్బ తిన్న పాక్ ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోను కప్‌ను ఎగురేసుకుపోవాలని భావిస్తొంది.
పాకిస్థాన్: యూనిస్‌ఖాన్(కెప్టెన్), హసన్, అక్మల్, షోయబ్ మాలిక్, మిస్బా, అఫ్రిది, రజాక్, ఫవాద్ అలమ్, ఉమర్‌గుల్, అజ్మల్, మహ్మద్ అమీర్.
శ్రీలంక: సంగక్కర(కెప్టెన్), జయసూర్య, దిల్షాన్, జయవర్ధనె, చమరసిల్వ, ముబారక్, మురళీధరన్, మెండీస్, మలింగ, ఇసురు ఉదన, మ్యాథ్యూస్.
News Posted: 21 June, 2009
|