ట్వంటీ చాంపియన్ పాక్
లండన్: శిఖరానికి చివరి మెట్టు ఎక్కుతూ శ్రీలంక జారిపడిపోయింది. ఫలితంగా పాకిస్థాన్ ట్వంటీ-20 ప్రపంచకప్ సాధించింది. క్రితం సారి భారత్ చేతిలో ఛాంపియన్‌షిప్ కోల్పోయిన పాకిస్థాన్... ఈ సారి ఆ తప్పు చేయలేదు. ముందు బౌలింగ్ లో... తర్వాత బ్యాటింగ్‌లో పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని చాటింది. శ్రీలంకను 8 వికెట్ల తేడాతో ఓడించింది. సెమీస్‌లో పాక్‌ను గెలిపించిన అఫ్రిదియే, ఫైనల్లోనూ జట్టును గెలిపించాడు. అజేయ మైన అర్ధసెంచరీ(54)తో జట్టును విజయం శిఖరానికి చేర్చాడు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు. పరుగుల స్టార్ దిల్షాన్‌కు మ్యాన్ అఫ్ ది సిరీస్ లభించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పో యి 138 పరుగులు చేయగా, దీన్ని పాకిస్థాన్ కేవలం 2 వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలోనే అధిగమించింది.
ప్రపంచకప్ లక్ష్యానికి కమ్రన్ అక్మల్(37), హసన్(19)లు 48 పరుగులతో శుభారంభమిచ్చారు. వీరిద్దరి నిష్ర్కమణతో క్రీజ్‌లోకి వచ్చిన అఫ్రిది, షోయబ్ మాలిక్ జాగ్రత్తగా ఆడారు. అనవసర షాట్లకు తావివ్వకుండా అడపా దడపా మెరుపులతో లక్ష్యానికి ఒక్కో పరుగును జోడించారు. చివరి వరకూ అజేయంగా నిలిచారు. అఫ్రిది 54(2్ఠ2,2్ఠ6) ఫిఫ్టీ చేసుకోగా, షోయబ్ మాలి్ 24 పరుగులు చేశాడు.
అంతకుముందు టాస్ నెగ్గిన శ్రీలంక కెప్టెన్ సంగక్కర తొలుత పరుగుపెట్టేందుకే మొగ్గుచూ పాడు. కానీ తానొకటి తలస్తే... దైవం మరోలా తలచిందన్నట్లు... లంక పరిస్థితి ఆదిలోనే అధో గతి పాలైంది. దిల్షాన్, వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ముబా రక్ డకౌట్లతో శ్రీలంక 2కే 2 వికెట్లను కోల్పోయింది. దిల్షాన్ ను అమిర్, ముబారక్‌ను రజాక్ ఔట్ చేశారు. దీనికి కాసేపటికే దూకుడుగా ఆడుతున్న జయసూర్య (17)ను రజాక్ బౌల్డ్ చేశాడు. మరికాసేపటికే జయవర్ధనె కూడా రజాక్ బౌలింగ్‌లోనే నిష్ర్కమించాడు. రజాక్ దెబ్బకు లంక 32/4. తర్వా త సంగక్కర ఒంటరిపోరాటం చేశాడు. అజేయంగా నిలిచి 64 పరుగులు చేశాడు. 139 పరుగుల పోరాడే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచాడు.
స్కోరుబోర్డు:
శ్రీలంక: దిల్షాన్ (సి)హసన్ (బి)అమిర్ 0, జయసూర్య (బి)రజాక్ 17, ముబారక్ (సి)హసన్ (బి)రజాక్ 0, సంగక్కర నాటౌట్ 64, జయవర్ధనె (సి)మిస్బా (బి)రజాక్ 1, చమరసిల్వ(సి)అజ్మల్ (బి)గుల్ 14, ఉదన (బి)అఫ్రిది 1, మ్యాథ్యూస్ నాటౌట్ 35, ఎక్స్‌ట్రాలు 6, మొత్తం (20 ఓవర్లలో) 138/6
వికెట్ల పతనం: 1-0, 2-2, 3-26, 4-32, 5-67, 6-70
బౌలింగ్: అమిర్ 4-1-30-1, రజాక్ 3-0-20-3, అఫ్రిది 4-0-20-1, అజ్మల్ 4-0-28-0, షోయబ్ 1-0-8-1, ఉమర్‌గుల్ 4-0-29-1
పాకిస్థాన్: అక్మల్ (స్టంప్డ్)సంగక్కర (బి)జయసూర్య , హసన్ (సి)జయసూర్య (బి)మురళీ 19, అఫ్రిది నాటౌట్ 54, మాలిక్ నాటౌట్ 24, ఎక్స్‌ట్రాలు 5, మొత్తం(18.4 ఓవర్లలో) 139/2
వికెట్ల పతనం: 1-48, 2-63
బౌలింగ్: మ్యాథ్యూస్ 2-0-17-0, ఉదన 4-0-44-0, మలింగ 3.4-0-14-0, మురళీధరన్ 3-0-20-1, మెండీస్ 4-0-34-0, జయసూర్య 2-0-8-1
News Posted: 21 June, 2009
|