భారత్-ఆసీస్ వన్డే వేదికలివే
ముంబాయి : వచ్చే అక్టోబర్ లో భారత్ - ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య జరగనున్న ఏడు వన్డేలకు వేదికలు ఖరారయ్యాయి. ఈ ఏడు మ్యాచ్ లకు ముంబాయి, గౌహతి, న్యూఢిల్లీ, మొహాలీ, హైదరాబాద్, నాగపూర్, జైపూర్ నగరాలు అతిథ్యం ఇవ్వనున్నాయి. అక్టోబర్ 25 నవంబర్ 11 తేదీల మధ్య భారత్ లో ఈ ఏడు వన్డేలు నిర్వహించాలని బిసిసిఐ టోర్నమెంట్ నిర్ణాయక కమిటీ నిర్ణయించింది. ఆయా నగరాల్లో ఏయే తేదీల్లో మ్యాచ్ లు నిర్వహించేదీ త్వరలోనే నిర్ణయించనున్నట్లు బిసిసిఐ నిర్ణాయక కమిటీ పేర్కొంది.
News Posted: 1 July, 2009
|