భారత్ దే వన్డే సిరీస్
సెయింట్ లూసియా: అడపా దడపా కురిసిన వర్షం కారణంగా ఆటకు అవాతరాలు ఏర్పడటంతో భారత, వెస్టీండ్ జట్ల మధ్య ఇక్కడ ప్రారంభమైన కీలక నాలుగో వన్డే మ్యాచ్ రద్దయింది. దీంతో నాలుగు వన్డేల సిరీస్ లో ఇప్పటికే 2-1 ఆధిక్యతతో ఉన్న భారత్ సిరీస్ విజేత అయింది. భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు. అంతకుముందు నాలుగో వన్డే టాస్ కూడా భారత కెప్టెనే నెగ్గాడు. గంట ఆలస్యమైన మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. మూడో వన్డే పిచ్ కావడంతో ధోనీ ఫీల్డింగ్ వైపే మొగ్గుచూపాడు. వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ధోనీ నిర్ణయాన్ని నిలబెడుతూ ఓపెనింగ్ బౌలర్ ఇషాంత్ నిప్పులు చెరిగాడు. తొలి ఓవర్లోనే విండీస్ కెప్టెన్ క్రిస్‌గేల్‌ను డకౌట్ చేశాడు.
ఎక్స్‌ట్రా బౌన్స్‌ను ఆడటంలో ఇబ్బంది పడ్డ గేల్ కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి నిష్ర్కమించాడు. 0కే ఒక వికెట్ కోల్పోయింది. విండీస్ తర్వాత మోర్టాన్‌కు శర్వాన్ జతయ్యాడు. జట్టు స్కోరు 7.3 ఓవర్లలో 27 పరుగులకు చేరింది. మళ్లీ వాన ముంచెత్తింది. ఆడేందుకు మరో అవకాశమివ్వకుండా మైదానాన్ని చిత్తడి చేసింది. పిచ్‌ను, ఔట్ ఫీల్డ్‌ను పరిశీలించిన అంపెైర్లు ఇక మ్యాచ్ సాగదని, ఫలితం తేలదని నిర్దారించారు. మ్యాచ్‌ను రద్దు చేశారు.
News Posted: 5 July, 2009
|