ఐపిఎల్ లో మళ్ళీ పాక్?
కరాచీ : వచ్చే సంవత్సరం ఇండియన్ ప్రీమియర్ లీక్ లో పాకిస్థాన్ ఆటగాళ్ళకు అవకాశం లభిస్తుందనే విశ్వాసాన్ని పేసర్ సొహైల్ తన్వీర్ భావిస్తున్నాడు. భద్రతా కారణాలదృష్ట్యా ప్రభుత్వం సూచన మేరకు తన్వీర్ రెండో ఐపిఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడని విషయం విదితమే. అయితే గతవారం ఇంగ్లాండ్ లో రాజస్థాన్ రాయల్స్ మిడిలెసెక్స్ తో ఒక చారిటీ మ్యాచ్ ఆడగా అందులో తన్వీర్ ఆడి 20 పరుగులకు 3 వికెట్లు సాధించాడు. ఇకపై ఐపిఎల్ ప్రాంఛైసీలు తమ జట్ల తరఫున పాకిస్థాన్ ఆటగాళ్ళను ఆడించేందుకు యోచిస్తున్నట్లు తాను భావిస్తున్నానని, కాబట్టి వచ్చే సీజన్ లో పాక్ ఆటగాళ్ళు ఐపిఎల్ లో ఆడే అవకాశం ఉందని తన్వీర్ తెలిపాడు.
News Posted: 13 July, 2009
|