గోపీకి ద్రోణాచార్య
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2008-09 క్రీడా పురస్కారాలను ప్రకటించింది. దేశం లో అత్యున్నత క్రీడా పురష్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డును ఈసారి ముగ్గురికి ప్రకటించింది. ఆలాగే భారత బ్యాడ్మింటన్‌లో ఆంధ్రా గురుశిష్యులు పుల్లెల గోపీ చంద్ ద్రోణాచార్య అవార్డుకు, సైనా నెహ్వాల్ అర్జున పురస్కారానికి ఎంపిక అయ్యారు. మొత్తం జాబితాలో ముగ్గురికి ఖేల్త్న్రా, 15 మంది క్రీడాకారులకు అ ర్జున అవార్డు, ఇద్దరిని ధ్యాన్‌చంద్ అవార్డుకు ఎంపిక చేసింది.
ఖేల్ రత్న అవార్డుకు మహిళా బాక్సింగ్ చాంపియన్‌గా మేరికామ్‌కే దక్కవచ్చని ఎక్కువగా ఊహించారు. అయితే మేరికామ్‌తో పాటు నామినీలు పొందిన విజేందర్ (బాక్సింగ్), సుశీల్ కుమార్ (రెజ్లింగ్)లను కూడా ప్రభుత్వం ఈ అవార్డుకు ఎంపిక చేసింది. మేరీకామ్ గత నాలుగేళ్లుగా ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్‌గా కొనసాగుతోంది. బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్యాలు అందించినందుకు విజేందర్, సుశీల్‌కుమార్‌లకు ఈ అవార్డు దక్కింది. అవార్డు కింద వచ్చే రూ.7.5 లక్షలను ముగ్గురు సమానంగా పంచుకోనున్నారు.
అయితే గతంలో ఒకే సారి ఇద్దరు క్రీడాకారులు ఈ అవార్డును అందుకున్న సందర్భాలుండగా, ఈ సారి ఏకంగా ము గ్గురు ఖేల్త్న్రాను అందుకోనున్నారు. 1996-97లో లియండర్‌పేస్ (టెన్నిస్), కుంజరాణిదేవి (వెయిట్‌లిప్టిర్)లకు, 2002-03లో అంజలీవేదపాఠక్ (షూటర్), కెఎం,బీనామోల్ (అథ్లెట్)లు సంయుక్తంగా రాజీవ్ ఖేల్త్న్రను పంచుకున్నారు.
తెలుగు తేజం పుల్లెల గోపీచంద్ కు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. పద్మశ్రీ, రాజీవ్‌ఖేల్త్న్రా, అర్జున అవార్డు, ద్రోణాచా ర్య పురష్కారాలను పొందిన తొలి క్రీడాకారుడిగా రికార్డు కెక్కాడు. తొలిసారిగా 1999లో అర్జున అవార్డు పొందిన గోపీ ఆ తర్వాత 2000-01 ఏడాదికి రాజీవ్‌ఖేల్‌ర త్నాకు ఎంపిక చేశారు. ఆ తర్వాత బ్యాడ్మింటన్‌కు చేసిన సేవలను గుర్తించిన కేంద్రం దేశ అత్యున్నత నాలుగో పౌరపురష్కారం పద్మశ్రీ తో సత్కరించింది. ప్రస్తుతం కోచ్ గా మారి బ్యాడ్మింటన్ సంచలనం సైనా సెహ్వాల్‌ను స్టార్‌గా రూపుదిద్దడంలో గోపీది విశేష కృషి దాగి వుంది. దీని ఫలితంగా గోపీకి ద్రోణాచార్య అవార్డుకు ఎంపిక చేశారు.
గంభీర్‌కు అర్జున...
గత రెండేళ్లుగా అన్ని ఫార్మాట్ క్రికెట్‌లో ను ఓపెనర్‌గా భారీ పరుగులు చేస్తున్న ఢిల్లీ స్టార్ బ్యాట్స్‌మన్ గౌతం గంభీర్ అర్జు న అవార్డుకు ఎంపిక అయ్యాడు. అలాగే షూటింగ్ డబుల్ ట్రాప్ ప్రపంచ రికార్డు సాధించిన రంజన్ సోధి, హాకీస్టార్ ఇగ్నేష్ టర్కి, చెస్ సంచలనం తానియా సచ్‌దేవ్‌లకు అర్జున పురష్కారాలు వరించాయి. టేబుల్ టెన్నిస్ మాజీ క్రీడాకారిణి ఇందుపూరి నేతృత్వంలోని కమిటీి గత వారం కేంద్రప్రభుత్వానికి నామినీల తుది కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. దీనిపై డ్రా మంత్రిత్వశాఖ జాబితాను ప్రకటించింది. అవార్డు పొందిన క్రీడాకారులకు జాతీయ క్రీడా దినోత్సవమైన ఆగస్టు 29న రాష్టప్రతి భవన్‌లో పురస్కారాలను అందజేస్తారు.
అర్జున అవార్డు:
సైనా నెహ్వాల్ (బ్యాడ్మింటన్), గంభీర్ (క్రికెట్), ఇగ్రేష్‌టర్కి (హాకీ), సురిందర్‌కౌర్ (హాకీ), తానియా సచ్‌దేవ్ (చదరంగం), రంజన్‌సోధి (షూటింగ్), మంగల్‌సింగ్ చాంపియా (ఆర్చరీ), సినిమోల్ పౌలొస్ (అథ్లెటిక్స్), ఎల్.సరితాదేవి (బాక్సింగ్), బి.ప్రభు (శారీరక వైకల్యం), సతీష్‌జోషి (రోయింగ్), పౌలోమి ఘటక్ (టేబుల్‌టెన్నిస్), యోగేశ్వర్ దత్ (రెజ్లింగ్), జి.ఎల్.యాదవ్ (యాటింగ్), పంకజ్‌శిరసత్ (కబడ్డీ)
ధ్యాన్‌చంద్ అవార్డు: ఇషార్‌సింగ్ డియోల్ (అథ్లెటిక్స్), సత్బీర్‌సింగ్‌దహ్యా(రెజ్లింగ్)
ద్రోణాచార్య అవార్డు:
పుల్లెల గోపీచంద్ (బ్యాడ్మింటన్), బల్దేవ్‌సింగ్ (హాకీ), జైదేవ్ బిష్త్ (బాక్సింగ్), సత్పాల్‌సింగ్ (ద్రోణాచర్య),
News Posted: 29 July, 2009
|