'చార్జర్స్' బ్రాండ్ గా సైనా హైదరాబాద్ : దక్కన్ చార్జర్స్ తన బ్రాండ్ అంబాసడర్ గా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ను నియమించింది. ఈ విషయం దక్కన్ చార్జర్స్ అధికార ప్రతినిధి ఒకరు శనివారంనాడు మీడియాకు తెలిపారు. భారతదేశంలో బ్యాడ్మింటన్ క్రీడను మరింతగా అభివృద్ధి చేసే లక్ష్యంతో సైనాను తన బ్రాండ్ అంబాసడర్ గా నియమించినట్లు సంస్థ స్పష్టం చేసింది. కాగా, తనను బ్రాండ్ అంబాసడర్ గా అవకాశం కల్పించిన దక్కన్ చార్జర్స్ కు సైనా కృతజ్ఞతలు తెలిపింది. ఈ నియామకం వల్ల తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది.
News Posted: 8 August, 2009
|