ఇంగ్లాండ్‌లో సంబరాలు లండన్: చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్ యాషెస్ సిరీస్ గెలుచుకోవడంతో ఆ దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి. అభిమానులు చివరి టెస్టు ముగిసిన వెంటనే వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. వేలాది మంది అభిమానులు ఈ సంబరాల్లో పాలుపంచుకున్నారు. ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ సాధించి పెట్టిన క్రికెటర్లపై ప్రశంసల వర్షం కురిపించారు.
ముఖ్యంగా జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించిన యువ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్, స్పిన్నర్ స్వాన్ కొత్త హీరోలుగా ఆవిర్భవించారు. ఆసీస్ చివరి వికెట్ పడిన వెంటనే అభిమానులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి వేడుకల్లో మునిగి తేలారు. ఒకరినొకరు అభినందించుకుంటూ విజయోత్సవాన్ని జరుపుకున్నారు. మిఠాయిలు పంచి పెట్టారు. అంతేగాక పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. చిరకాల ప్రత్యర్థిపై విజయాన్ని సాధించిన జాతీయ జట్టుపై ప్రశంసల వర్షం కురిపించారు.
News Posted: 24 August, 2009
|