టాప్ రాంకర్ గంభీర్ దుబాయి: భారత స్టార్ ఓపెనర్ గౌతం గంభీర్ ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్ స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు టాప్ ర్యాంక్‌లో కొనసాగిన శ్రీలంక సారథి కుమార సంగక్కర రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. మరోవైపు ఇప్పటివరకు మూడో ర్యాంక్‌లో కొనసాగిన గంభీర్ రెం డు ర్యాంక్‌లను మెరుగుపరుచుకుని మొదటి స్థానాన్ని అక్రమించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో సరిగ్గా రాణించక పోవడంతో సంగక్కర తొలి ర్యాంక్‌ను కోల్పోయాడు.
మరోవైపు ఇటీవల కాలంలో ఒక్క మ్యాచ్‌ను ఆడని గంభీర్ అనూహ్యంగా టాప్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఈ ఏడాది జులైలో గంభీర్ తొలిసారిగా టెస్టుల్లో ప్రథమ ర్యాంక్‌ను అందుకున్న విషయం తెలిసిందే. కాగా, యాషెస్ సిరీస్‌లో విఫలమైన మైఖేల్ క్లార్క్ ఐదో ర్యాంక్‌కు పడి పోయాడు. ఇక, బౌలింగ్‌లో ఇంగ్లాండ్ యువ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ 11 స్థానాలు మెరుగుపరుచుకుని 13వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. మరోవైపు ఇంగ్లాండ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ 17 స్థానాలు ఎగబాకి తాజా ర్యాంకింగ్స్‌లో 10వ ర్యాంక్‌కు దూసుకెళ్లాడు.
News Posted: 24 August, 2009
|