భజ్జీకి పోలీసుల జరిమానా చండీగఢ్ : వివాదాలు, హర్భజన్ సింగ్ సహవాసం చేస్తున్నట్లున్నది. తాను ఈమధ్యే దిగుమతి చేసుకున్న హమ్మర్ వాహనాన్ని రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా నడుపుతున్నందుకు ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (భజ్జీ)కి చండీగఢ్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం జరిమానా విధించారు. 'నిబంధనలు ఉల్లంఘించినందుకు మేము రూ. 3000కు చలాన్ జారీ చేశాం' అని చండీగఢ్ సీనియర్ ఎస్ పి (ట్రాఫిక్) హెచ్.ఎస్. డూన్ తెలియజేశారు.
News Posted: 2 September, 2009
|