లంక లక్ష్యం 320 కొలంబో : కాంపాక్ కప్ ముక్కోణపు కప్ గెలుచుకోవాలంటే 320 పరుగులు చేయాల్సిన లక్ష్యాన్ని ఆతిథ్య శ్రీలంక జట్టుకు భారత్ నిర్దేశించింది. ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో సోమవారం జరుగుతున్న డే - నైట్ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు కెప్టెన్ ధోనీ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ను ఎంచుకున్నాడు. మిస్టర్ వాల్ రాహుల్ ద్రావిడ్ - మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ లతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ సచిన్ టెండుల్కర్ సెంచరీ, కెప్టెన్ ధోనీ, యువరాజ్ సింగ్ ల అర్ధ సెంచరీలతో భారీ స్కోరు దిశగా సాగిపోయింది. నిర్ణీత 50 ఓవర్లలో భారత్ ఐదు వికెట్లు నష్టపోయి 319 పరుగులు చేసింది. లంక బౌలర్లలో థిలన్ తుషార 2 వికెట్లు, లసిత్ మలింగ, అంజతా మెండిస్, సనత్ జయసూర్య తలో వికెట్ తీశారు. భారత బ్యాట్స్ మెన్ రాహుల్ ద్రావిడ్ 39, సచిన్ టెండుల్కర్ 138, ధోనీ 56, యువరాజ్ సింగ్ 56 (నాటౌట్), యూసఫ్ పఠాన్ 0, సురేష్ రైనా 8, విరాట్ కోహ్లి 2 పరుగులు (నాటౌట్) చేశారు.
News Posted: 14 September, 2009
|