అత్యుత్తమ క్రికెటర్ గంభీర్ ముంబై: కాస్ట్రోల క్రికెటర్ ఆఫ్‌ది ఇయర్ 2008 అవార్డును భారత ఓపెనర్ గౌతం గంభీర్ దక్కించుకున్నా డు. సహచరుడు సెహ్వాగ్‌ను వెనక్కినెట్టి గంభీర్ ఈ అవార్డును గెలుచుకున్నాడు. 2008 సీజన్‌లో టెస్టు, వన్డే క్రికెట్‌లో వెయ్యి పరుగులను అధిగమించిన గంభీర్‌ను ఉత్తమ క్రికెటర్‌గా ఎంపిక చేశారు. అవార్డు కింద గంభీర్‌కు ఐదు లక్షల రూపాయల నగదు బహుమతి అందుకున్నాడు.
కాగా, ఉత్తమ బౌలర్ అవార్డును హర్భజన్ సింగ్ గెలుచుకున్నాడు. అతనికి రెండు లక్షల రూపాయల నజరానా అందించారు. మాజీ భారత ఆటగాడు గుండప్ప విశ్వనాథ్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ టెస్టు క్రికెటర్‌గా సెహ్వాగ్, ఉత్తమ వన్డే క్రికెటర్‌గా ధోనీ అవార్డులు పొందారు. సచిన్, ద్రవిడ్‌లకు ప్రత్యేక అవార్డులు దక్కాయి. యంగ్ క్రికెటర్ ఆఫ్‌ది ఈయర్ అవార్డును రవీంద్ర జడేజా అందుకున్నాడు.
News Posted: 18 September, 2009
|