శ్రీలంక 150\1 సెంచూరియన్ : ఐసిసి చాంపియన్ షిప్ లో భాగంగా మంగళవారం ఇక్కడ దక్షిణాఫ్రికా - శ్రీలంక జట్ల మధ్య గ్రూప్ బి తొలి వన్డేలో శ్రీలంక 25 ఓవర్లు పూర్తయ్యే సరికి ఒక వికెట్ నష్టపోయి 150 పరుగులు చేసింది. ఇక్కడి సూపర్ స్పోర్ట్ పార్క్ లో డే \ నైట్ గా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. దీనితో శ్రీలంక ముందుగా బ్యాటింగ్ బరిలో దిగింది.
తిలకరత్నె దిల్షాన్ - సనత్ జయసూర్యలతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 2.2వ ఓవర్ లోనే సనత్ జయసూర్య వికెట్ పోగొట్టుకుంది. అప్పటికి శ్రీలంక స్కోరు 16 పరుగులు ఉంది. దక్షిణాఫ్రిగా బౌలర్ డేల్ స్టేన్ విసిరిన బంతిని ఆడబోయిన జయసూర్య తొట్రుపడి ఎల్ బిడబ్ల్యుగా వికెట్ ను అప్పగించి పెవిలియన్ కు చేరుకున్నాడు. తిలకరత్నె దిల్షాన్ కు తోడుగా శ్రీలంక కెప్టెన్ \ వికెట్ కీపర్ కుమార సంగక్కర బరిలో దిగాడు. ఇద్దరూ చక్కని సమన్వయంతో ఆడుతూ స్కోరును పెంచుతున్నారు. 25 ఓవర్లు పూర్తయ్యే సరికి దిల్షాన్ 81 పరుగులతోను, సంగక్కర 49 పరుగులతోను ఆడుతున్నారు.
News Posted: 22 September, 2009
|