చేతులెత్తేసిన కరేబియన్స్ జోహెన్నెస్‌బర్గ్ : పేలవమైన ఆట తీరుతో కరేబియన్లు పరాజయం పాలైయ్యారు. కీలకమైన టాస్ గెలిచినా మ్యాచ్ ను ప్రత్యర్ధి పాకిస్తాన్ కు అప్పగించారు. ఛాంపియన్స్ ట్రోఫి లో పాకిస్తాన్- వెస్టిండీస్ జట్ల మధ్య బుధవారం రాత్రి జరిగిన రెండో మ్యాచ్ లో బౌలర్లు బెంబేలెత్తించారు. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో విండీస్ ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 34.3 ఓవర్లలోనే 133 పరుగులకు ఆలౌటైంది. పాక్ బౌలర్లు అద్భుత బౌలింగ్ విండీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. ఈ లక్ష్యాన్ని పాకిస్థాన్ 30.3 ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఉమర్ అక్మల్(41 నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌తో జట్టును విజయతీర్థాలకు చేర్చాడు. సులభలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాక్ ప్రారంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఇమ్రాన్(5), కమ్రాన్ (5) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. విండీస్ బౌలర్ టోంగ్ అద్భుత బౌలింగ్ పాక్ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు.
ఒక దశలో అతని ధాటికి పాక్ 61 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. అయితే ఉమర్ అక్మల్, కెప్టెన్ అఫ్రిది(17)తో కలిసి జట్టును గట్టేక్కించాడు. వీరిద్దరూ 6వ వికెట్‌కు అజేయంగా 58 పరుగులు జోడించి విజయం అందించారు. అక్మల్ 51 బంతుల్లో 6ఫోర్లతో 41 పరుగులు చేశాడు. అఫ్రిది 17 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో టోంగ్ నాలుగు వికెట్లు తీశాడు. ఉమర్ అక్మల్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.
అమేర్, రాణా నవీద్ నిప్పులు చెరిగే బంతులతో విండీస్ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించారు. అమేర్ ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే రిచర్డ్‌స(1)ను ఔట్ చేసి వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టాడు. మరోవైపు రాణా నవీద్ ఫ్లెచర్(7)ను పెవిలియన్ పంపాడు. తర్వాత వచ్చిన డౌలిన్(0)ను ఉమర్‌గుల్ ఔట్ చేశాడు. దీంతో విండీస్ 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఒకరివెంట ఒకరు పెవిలియన్ చేరడంతో మళ్లీ కోలుకోలేక పోయింది. గుల్, అమేర్ పోటీ వపడి వికెట్లు తీశారు. ఒకవైపు వికెట్లు పడిపోతున్న మిల్లర్ ఒంటరి పోరాటం చేశా డు. పాక్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ అర్ధ సెంచరీ సాధించాడు. చివరి వరుసలో బ్యాటింగ్‌కు దిగిన మిల్లర్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. 57 బంతులు ఎదుర్కొని 6ఫోర్లు, సిక్స్‌తో 51 పరుగులు చేశాడు. సామి (25) పరుగులు అతనికి సహకరించాడు. పాక్ బౌలర్లలో అమే ర్, నవీద్ మూడేసి, అక్మల్ రెండు వికెట్లు పడగొట్టాడు.
News Posted: 23 September, 2009
|