టాప్ లేచిన లంక! జోహెన్నెస్ బర్గ్ : ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి శ్రీలంక జట్టు టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. కేవలం 20 ఓవర్లలో కేవలం 81 పరులకు ఐదు టాప్ ఆర్డర్ వికెట్లను అప్పగించి శ్రీలంక జట్టు బేలచూపులు చూస్తోంది. ఐసిసి చాంపిన్స్ ట్రోఫీ కోసం శుక్రవారం ఇక్కడి న్యూ వాండరర్స్ స్టేడియంలో జరుగుతున్న నాలుగవ వన్డే మ్యాచ్ (డే & నైట్)లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ చేస్తున్నది. టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు దిగిన తొలి నలుగురు బ్యాట్స్ మెన్ తిలకరత్నె దిల్షాన్ (2), సనత్ జయసూర్య (0), కెప్టెన్ కుమార సంగక్కర (1), మహేల జయవర్దనె (9) కనీసం రెండంకెల స్థాయికి కూడా చేరలేక చతికిలపడ్డారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన థిలాన్ సమరవీర ఇంగ్లండ్ బౌలర్లను కొంత మేరకు ధైర్యంగా ఎదుర్కొని నిలబడినప్పటికీ తానూ తలవంచక తప్పలేదు. శ్రీలంక జట్టు 81 స్కోర్ వద్ద సమరవీర వ్యక్తిగత స్కోర్ 30 పరుగుల వద్ద ఇంగ్లండ్ బౌలర్ బ్రాడ్ వేసిన బంతిని కాలింగ్ వుడ్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. థిలిన కందంబె (25), ఏంజెలో మాథ్యూస్ (10) క్రీజు వద్ద ఉన్నారు.
ఇంగ్లండ్ బౌలింగ్ లో జేమ్స్ ఆండర్సన్, గ్రాహం ఓనియన్స్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. స్టువర్ట్ బ్రాడ్ ఒక వికెట్ పడగొట్టాడు.
News Posted: 25 September, 2009
|