భారత్, పాక్ పోటీపై ఉత్కంఠ సెంచురియన్ : ఇది విభిన్నమైన శనివారం రాత్రి ఉత్కంఠ. పరస్పరం ఢీకొన్న పదిహేను మాసాల అనంతరం భారత, పాకిస్తాన్ క్రికెట్ జట్లు దక్షిణాఫ్రికాలోని సెంచురియన్ లో తలపడినప్పుడు చాంపియన్స్ ట్రోఫీకి ఉత్తేజాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తాయి. భారత, పాక్ జట్ల మధ్య ఎప్పుడు పోటీ జరిగినా రెండు జట్లలోనూ ఉత్కంఠ ఎక్కువగానే ఉంటుంది. కాని ఈ పర్యాయం భారత జట్టుపైనే ఒత్తిడి కాస్త అధికంగా ఉండనున్నది. ఎందుకంటే నంబర్ వన్ ర్యాంకును నిలబెట్టుకోవడం వారి లక్ష్యం. అంతే కాకుండా క్రితం సారి ఇంగ్లండ్ లోని ఎడ్జ్ బాస్టన్ లో చాంపియన్స్ ట్రోఫీలో పరస్పరం తలపడినప్పుడు భారత జట్టుపై పాక్ జట్టుదే పైచేయి అయింది.
అయితే, భారత జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోని తాము పాకిస్తాన్ ను 'ఏదో ఒక జట్టు'గా పరిగణించడం లేదని చెప్పాడు. 'అలా చేసినట్లయితే మాపై మేమే ఒత్తిడి తెచ్చుకున్నవారం అవుతాం' అని అతను చెప్పాడు. 'ఏ గేముకైనా సిద్ధపడినప్పుడు గెలవాలనే అందరూ కాంక్షిస్తారు' అని అతను అన్నాడు. కాని అతను హెచ్చరిక స్వరంతో ఒక మాట కూడా అన్నాడు. 'పాకిస్తాన్ ప్రమాదకరమైన జట్టు అని మాకు తెలుసు' అని ధోని చెప్పాడు. యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ సేవలు లభించకపోతుండడంతో భారత జట్టు పెద్ద స్కోరు కోసం సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రావిడ్, ధోనిలపై ఆధారపడనున్నది.
News Posted: 26 September, 2009
|