ఆస్ట్రేలియా 275\8 జోహెన్నెస్ బర్గ్ : ఇక్కడి న్యూ వాండరర్స్ స్టేడియంలో శనివారం జరుగుతున్న ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ఎ లోని 5వ వన్డేలో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 275 పరుగులు చేసింది. వెస్టిండీస్ జట్టుకు 276 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు ముందుగా ఆస్ట్రేలియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.
దీనితో షేన్ వాట్సన్ - టిమ్ పైన్ లతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి వికెట్ (షేన్ వాట్సన్)ను తొలి బంతికే కోల్పోయింది. వెస్టిండీస్ ఓపెనింగ్ బౌలర్ రోచ్ వేసిన తొలి బంతికే వాట్సన్ క్లీన్ బౌల్డ్ అయి పెవిలియన్ చేరుకున్నాడు. ఒన్ డౌన్ లో క్రీజ్ వద్దకు వచ్చిన కెప్టెన్ రికీ పాంటింగ్ ఓపెనింగ్ బ్యాట్స్ మన్ టిమ్ పైన్ చక్కని అవగాహనతో ఆడి స్కోరును పరుగులెత్తించారు. టిమ్ పైన్ 33, రికీపాంటింగ్ 79, మైఖేల్ హస్సే 6, కల్లమ్ ఫెర్గూసన్ 20, కామెరూన్ వైట్ 4, జేమ్స్ హోప్స్ 5, బ్రెట్ లీ 25 పరుగులు చేశారు. 73 పరుగులతో మిట్చెల్ జాన్సన్, 7 పరుగులతో నాథన్ హారిట్జ్ నాటౌట్ బ్యాట్స్ మెన్ గా నిలిచారు.
వెస్టిండీస్ బౌలింగ్ లో కెమర్ రోచ్, డేవిడ్ బెర్నార్డ్, నికితా మిల్లర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. డారెన్ సమ్మీ ఒక వికెట్ తీసుకున్నాడు. బ్రెట్ లీ రన్నౌట్ అయ్యాడు. కాగా, 276 పరుగులు విజయ లక్ష్యంతో వెస్టిండీస్ డేవన్ స్మిత్ - ఆండ్రే ఫ్లెట్చర్ తో పరుగుల వేట ప్రారంభించింది. అయితే, ఆట 5.4వ ఓవర్లో వెస్టిండీస్ స్కోర్ 38 పరుగుల వద్ద ఓపెనర్ స్మిత్ వికెట్ ను జారవిడుచుకుంది. పీటర్ సిడ్డిల్ వేసిన బంతిని ఆడిన స్మిత్ టిమ్ పైన్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆట 13.3వ ఓవర్ జరుగుతుండగా ఆండ్రే ఫ్లెట్చర్ 24, ట్రావిస్ డౌలిన్ 13 పరుగులతోను క్రీజ్ వద్ద ఉన్నారు.
News Posted: 26 September, 2009
|