ఆసీస్ విజయలక్ష్యం 206 సెంచూరియన్ : ఆస్ట్రేలియా జట్టుకు 206 పరుగుల విజయలక్ష్యాన్ని పాకిస్తాన్ నిర్దేశించింది. టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించింది. ఆసీస్ ఆహ్వానం మేరకు ముందుగా బ్యాటింగ్ బరిలో దిగిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ వన్డే అంతర్జాతీయ పోటీల గ్రూపు ఎ విభాగంలోని 11వ వన్డే ఇక్కడి సూపర్ స్పోర్ట్ పార్క్ లో జరుగుతోంది.
పాకిస్తాన్ జట్టులోని ఏ ఒక్కరూ అర్ధ సెంచరీ చేయకపోయినా ప్రతి ఒక్కరూ సంయమనంతోను, సమన్వయంతోను జిడ్డుగా ఆడి వీలైనంత మేరకు భారత్ ను సెమీ ఫైనల్ కు చేరకుండా చేయాలన్న దుర్బుద్ధితో దొంగాట ఆడిన వైనం కొట్టొచ్చినట్లు కనిపించింది. పాకిస్తాన్ బ్యాటింగ్ లో కమ్రన్ అక్మల్ 63 బంతులకు 44, షాహిద్ అఫ్రిదీ 18 బంతులాడి 15, కెప్టెన్ యునిస్ ఖాన్ 49 బంతులు ఎదుర్కొని 18, షోయబ్ మాలిక్ 37 బంతుల్లో 27, మొహమ్మద్ యూసఫ్ 69 బంతులు ఎదుర్కొని 45, మిస్బావుల్ హక్ 53 బంతులు ఆడి 41 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఉమర్ అక్మల్ 2, రణ నవేద్ 7 పరుగులతో అజేయంగా నిలిచారు.
ఆస్ట్రేలియా బౌలింగ్ లో మిట్చెల్ జాన్సన్, షేన్ వాట్సన్ చెరో రెండేసి వికెట్లు పడగొట్టారు. బ్రెట్ లీ, జేమ్స్ హోప్స్ చెరో వికెట్ తీసుకున్నారు. షేన్ వాట్సన్ - టిమ్ పెయిన్ లతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 206 పరుగుల విజయ లక్ష్యంతో పరుగుల వేట కొనసాగిస్తోంది.
News Posted: 30 September, 2009
|