ఫీల్డింగ్ ఎంచుకున్న ఇండియా జోహెన్నెస్ బర్గ్ : ఇక్కడి న్యూ వాండరర్స్ స్టేడియంలో బుధవారం ఐసిసి చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ఎ విభాగంలో 12వ డే అండ్ నైట్ వన్డే పోటీలో భారత జట్టు టాస్ గెలిచి, ముందుగా ఫీల్డింగ్ ను ఎంచుకుంది. భారత జట్టు కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీ వెస్టిండీస్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.
కాగా ఈ రోజు మ్యాచ్ లో భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ ఎదురైంది. కలుషిత ఆహారం కారణంగా కడుపునొప్పి బాధపడుతున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ రోజు మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు. సచిన్ స్థానంలో దినేష్ కార్తీక్ ను జట్టులోకి తీసుకున్నారు. మరో పక్కన ఇషాంత్ శర్మను మేనేజ్ మెంటు పక్కన పెట్టింది. ఇషాంత్ స్థానంలో అభిషేక్ నాయర్ జట్టులో స్థానం పొందాడు.
ఈ మ్యాచ్ ను భారత జట్టు తప్పనిసరిగా నెగ్గాల్సిన ఆవశ్యకతతో పాటు గ్రూప్ బి లో సెంచూరియన్ లో ఆస్ట్రేలియా - పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ను ఆస్ట్రేలియా గెలవకుండా పాకిస్తాన్ నిలువరించి భారత్ కు మేలు చేస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.
News Posted: 30 September, 2009
|