ఐసిసి జట్ల సారథి ధోని జోహాన్నెస్ బర్గ్ : టీమ్ ఇండియా సారథి మహేంద్ర సింగ్ ధోనిని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఒడిఐ, టెస్ట్ జట్ల కెప్టెన్ గా ఎంపిక చేశారు. గురువారం రాత్రి జోహాన్నెస్ బర్గ్ లో ఐసిసి అవార్డుల ప్రదానోత్సవంలో ఈ విషయం ప్రకటించారు. ఐసిసి ఒడిఐ జట్టులో మరి ఇద్దరు భారతీయులు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ సభ్యులుగా ఉన్నారు. ఐసిసి ప్రపంచ టెస్ట్ జట్టులో చోటు సంపాదించిన భారతీయులు గౌతమ్ గంభీర్, సచిన్ టెండూల్కర్. ఇక ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ టెస్ట్ జట్టులో 12వ క్రీడాకారునిగా చోటు సంపాదించాడు.
ఇది ఇలా ఉండగా ధోనిని 'ఒడిఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్'గా ప్రకటించారు. గంభీర్ ను అత్యుత్తమ టెస్ట్ క్రీడాకారునిగా ఎంపిక చేశారు. 2008 ఆగస్టు 13 నుంచి 2009 ఆగస్టు 24 వరకు జరిగిన మ్యాచ్ లలో కనబరచిన ప్రదర్శనను బట్టి ఈ అవార్డులను ప్రకటించారు.
News Posted: 2 October, 2009
|