కివీస్ తో పాక్ సెమీఫైనల్స్ జొహనెస్‌బర్గ్: ఛాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీస్‌కు పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు సమయాత్తమయ్యాయి. రెండు జట్లలోనూ స్టార్ ఆల్‌రౌండర్లు ఉండడంతో పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. చిరకాల ప్రత్యర్థి భారత్‌పై సాధించిన ఉత్సాహంతో పాక్ ఉరకలేస్తోంది. ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన చివరి మ్యాచ్‌లో చివరి బంతి వరకు పోరాడిన యూనిస్ సేన సెమీస్‌లో విజయమే లక్ష్యంగా బరిలో దిగుతోంది.
మహ్మద్ యూ సుఫ్, కమ్రాన్, మిస్బా, షోయబ్‌మాలిక్, ఉమర్ అక్మల్, యూనిస్, అఫ్రిదిలతో పాక్ బ్యాటింగ్ లైనప్ ఎంతో బలంగా ఉంది. అయితే ఆసీస్‌పై వీరు నత్తనడకగా ఆడడం ఒక్కటే కలవరించే విషయం. మరోవైపు రాణా నవీద్, అజ్మల్, గుల్, ఆసిఫ్, అఫ్రిదిలతో కూడిన బౌలింగ్ ఎంతో పటిష్టంగా ఉంది. మరోవైపు చివరి లీగ్‌లో ఇంగ్లాండ్‌పై విజయం సాధించి జోరుమీదున్న కివీస్ సెమీస్‌లో పాక్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లాలనే పట్టుదలతో ఉంది. గుప్టిల్, ఎలియట్, టేలర్, మెకుల్లమ్‌లతో కూడిన బ్యాటింగ్ లైనప్ ప్ర త్యర్థి బౌలర్లకు సమస్యలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
News Posted: 3 October, 2009
|